ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ -2 అభ్యర్థులకు ఊరట అందించే వార్త ఒకటి చెప్పింది ఏపీపీఎస్సీ. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును మరో వారం రోజులు పొడిగించింది. ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు తెలిపారు. గ్రూప్- 2 పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో.. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నిర్వహణ అధ్వానంగా ఉందని అభ్యర్థులు తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు రోజుల తరబడి ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీ బోర్డును విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గ్రూప్-2 దరఖాస్తు గడువును మరో వారం పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Read Also: Raghuveera Reddy: ఏపీలో విన్నింగ్ షాట్ కొట్టడానికే మాణిక్కం ఠాకూర్ వచ్చాడు..
వాస్తవంగా ఇవాళ్టితో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ క్రమంలో జనవరి 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఇదిలాఉంటే.. గత డిసెంబర్‌లో రాష్ట్రంలో మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. అయితే.. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కమిషన్ స్పష్టం చేసింది.
Read Also: BJP: బీజేపీ టార్గెట్ 400.. ప్రతిపక్ష ఎంపీలను చేర్చుకునేందుకు ప్యానెల్ ఏర్పాటు.!