దాదాపు ఏడాది తర్వాత రోహిత్, కోహ్లీ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. దీంతో.. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరూ ఆడే అవకాశాలు పెరిగాయి. ఈ విషయాలన్నింటిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడారు. భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రేపటి (గురువారం) నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లూ ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ఈ సిరీస్ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇదే చివరి…
ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో బుధవారం సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కాగానే కార్మిక సంఘాలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి.
రేపటి (జనవరి 11) నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. అయితే.. జట్టులోకి వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేష్ శర్మలను తీసుకున్నారు. ఈ సందర్భంగా.. రిషబ్ పంత్ ప్రస్తావన తీసుకొచ్చారు సునీల్ గవాస్కర్. అతను ఒంటికాలిపై నిలబడగలిగినప్పటికీ.. 2024 ప్రపంచకప్ నాటికి తిరిగి జట్టులోకి రావాలని గవాస్కర్ తెలిపాడు. ఎందుకంటే అతను ప్రతి ఫార్మాట్లో గేమ్ ఛేంజర్ పాత్ర పోషిస్తాడు.
విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. తన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు.
పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను డిస్కౌంట్‌తో క్లియర్ చేసే తేదీని జనవరి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పొడిగించింది. ప్రజల నుండి ప్రోత్సాహకరమైన స్పందన దృష్ట్యా తేదీని నెలాఖరు వరకు పొడిగించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లపై రాయితీ గడువు పొడిగింపు జనవరి 10 నుండి జనవరి 31 వరకు సవరించబడింది. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్లను ఈ-చలాన్ వెబ్సైట్ ద్వారా…
అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానేకు 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. లామిచానే.. నేపాల్ క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్ గా వ్యవహరించగా, ఐపీఎల్ రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. మీడియా కథనాల ప్రకారం.. అత్యాచారం కేసులో క్రికెటర్ సందీప్ లామిచానేకు నేపాల్ కోర్టు బుధవారం ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.
సీఎం జగన్ తో సమావేశంలో మార్పులపై రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తన భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. తనకు ఎలాంటి గాభరా లేదని చెప్పారు. పెందుర్తి, చోడవరం అంటూ ప్రచారాలు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ కు అమర్నాథ్ అంటే ఏంటో తెలుసు.. తనకు ఏమి చెయ్యాలో ఆయనకి తెలుసని చెప్పారు. తాను పార్టీకి ఎలాంటి సేవ చేయాలో సీఎం జగన్ కు తెలుసన్నారు. మరోవైపు.. ఈ నెలలో కర్నూల్…
ట్రాఫిక్ నిబంధనలలో (హిట్ అండ్ రన్ లా) కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులకు నిరసనగా పంజాబ్ లోని కోట్కాపురాలో ఓ ట్రక్కు డ్రైవర్ 250 అడుగుల ఎత్తైన టవర్ ఎక్కాడు. సుమారు ఆరు గంటల పాటు టవర్ పైనే ఉన్నాడు. ఆ తర్వాత ఓ జర్నలిస్ట్ సాయంతో పోలీసులు అతన్ని కిందకు దించారు. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘగన మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో జరిగింది. సమాచారం…
కేశినేని నానిపై ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్లపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రమాణం చేశారు. కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏంట్రా నాని అంటూ తీవ్రంగా మండిపడ్డారు. క్యారెక్టర్ లెస్ కేశినేని నాని ఏదేదో మాట్లాడాడని.. చంద్రబాబు రెండు సార్లు కేశినేని నానిని ఎంపీ చేశారని బుద్దా వెంకన్న చెప్పారు.