సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి శరీరంలోని చాలా జీవక్రియ ప్రక్రియలను నియంత్రిస్తుంది. థర్మోగ్రూలేషన్, హార్మోన్ల పనితీరు, బరువు నిర్వహణ దీని ముఖ్యమైన విధులు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ పనిచేయకపోవటంతో బాధపడుతున్నారు. చాలామందికి దీని గురించి తెలియదు. ప్రజలు థైరాయిడ్ వ్యాధితో సాధారణ లక్షణాలను మొదట లింక్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. కొంతమంది మానసిక కల్లోలం, జ్ఞాపకశక్తి సమస్య, బరువు పెరుగుట లేదా అలసటతో బాధపడుతున్నారు. వీటన్నింటిని వారు వ్యక్తిగతంగా సమస్యగా చూస్తారు.…
ఏపీలో కులగణన ప్రక్రియ షెడ్యూలులో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనవరి 19 తేదీ నుంచి 28 తేదీలోగా కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
ట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి కేంద్ర ఆర్కియాలజీ శాఖ సానుకూలంగా స్పందించింది. అలిపిరి వద్ద వున్న పాదాల మండపం, తిరుమల పుష్కరిణి వద్ద వున్న అహ్నిక మండపం శిథిలావస్థలో వుండడంతో పున:నిర్మించాలని పాలకమండలి నిర్ణయించింది.
ఆర్టీసీ బలోపేతంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది… ఇప్పటికే 80 బస్సులను ప్రారంభించుకొని ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఆర్టీసీ ముందుకు వెళ్తుంది.. ఈ సంవత్సరం జులై నెలలోపు మరో 1000 బస్సులు రోడ్డెక్కనున్నాయని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మీ పథకం అమలు చేశామని ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన వస్తు…
కేశినేని నాని వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. అనంతరం.. విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. తన రాజీనామాను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని స్పీకర్ను కోరారు. కాగా.. కేశినేని రాజీనామా అంశంపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. కేవలం ఎంపీ పదవి కోసం…
ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం అంబటి రాయుడికి పవన్ కళ్యాణ్ వినాయకుడి వెండి ప్రతిమను బహూకరించారు. ఇదిలా ఉండగా.. ఈ సమావేశం వివరాల గురించి అంబటి రాయుడు తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్లో తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు విచారణ… రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ను తప్పుదోవ పట్టించారా లేదా.. అని చెన్నమనేని ప్రశ్నించిన హైకోర్టు… కోర్టు ను తప్పుదోవ పట్టించునే వాళ్లకు ఉపషమనం ఎందుకు కల్పించాలని వ్యాఖ్యానించింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో జర్మనీ పౌరసత్వం తో పోటీ చేసారన్న హైకోర్టు.. జర్మనీ పౌరసత్వం తోనే ఇంకా ప్రయాణాలు చేస్తున్నారా…
విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలుచేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సుదీర్ఘంగా సమీక్షించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీధర్ బాబులతో కలిసి నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్తు వినియోగం, 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరా,…
భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ భారత పర్యటన కోసం ఇంగ్లాండ్ A (ఇంగ్లండ్ లయన్స్) జట్టులో చేరనున్నాడు. అతను 9 రోజుల పాటు జట్టులో చేరి ఇంగ్లండ్ లయన్స్ సన్నాహాల్లో సహాయం చేస్తాడు. కార్తీక్ బ్యాటింగ్ సలహాదారుగా చేరనున్నాడు. భారతీయ పరిస్థితులకు సంబంధించి సలహాలు ఇవ్వనున్నాడు.
ముఖ్యమంత్రి పదవి కోసం, పవన్కు అధికారము కోసం ఈ పోరాటం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తునిలో 'రా కదలిరా' బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో రాజకీయం మారిపోయిందని ఆయన అన్నారు. జగన్ పని అయిపోయిందని.. జీవితంలో పోటీ చేసే పరిస్థితి లేదన్నారు.