హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు యువకులు అమ్ముతున్నారు.. అను ఇంజనీరింగ్ కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీ-ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అశోక్ కుమార్ తో పాటు మరో మైనర్ అరెస్టు చేశారు. స్టూడెంటైన అశోక్ కుమార్, డ్రగ్స్ కు బానిసగా మారాడు.. ఆ తరువాత డ్రగ్స్ సేవిస్తూనే సరఫరాదారుడిగా మారాడు అని పోలీసులు పేర్కొన్నారు. అశోక్ కుమార్ తో పాటు అరెస్టైన మైనర్ కూడా డ్రగ్స్ పెడ్లర్ గా గుర్తించారు. వీరిద్దరూ రాజస్థాన్ ప్రాంతానికి చెందిన వారు అని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాకు ఆమోదం.. సర్కార్ కు గవర్నర్ కీలక సూచనలు
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ తో పాటు సభ్యుల రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.. అయితే, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇతర సభ్యులు డిసెంబర్ లో రాజీనామాలు సమర్పించిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అడిగిన గవర్నర్.. దీంతో పాటు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారు. కాగా, గత చైర్మన్ , బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని గవర్నర్ సూచించారు.
ఏ పార్టీ అయినా రెడీ.. నేను కళ్యాణదుర్గం, నా కుటుంబ సభ్యులు రాయదుర్గం నుంచి పోటీ..!
ఏ పార్టీ నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నాను.. నేను కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి.. నా కుటుంబ సభ్యులు రాయదుర్గం స్థానం నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. ఈ రోజు రాయదుర్గంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయదుర్గం నియోజకవర్గంలో నాకు తోడుగా ఉన్న కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానన్నారు. ఈ సారి ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుండి పోటీ చేస్తున్నాను. నా కుటుంబ సభ్యులు రాయదుర్గం నుండి పోటీ చేస్తారని తెలిపారు. అయితే.. ఏ పార్టీ నుంచి అవకాశం ఇచ్చిన నేను పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నారు. కానీ, సోషల్ మీడియాలో టికెట్ వస్తుంది అనే అభ్యర్థులు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా కార్యకర్తల పైన బెదిరింపు ధోరణితో దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో వెనుకబడింది
నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడింది అని పేర్కొనింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నన్ను ఇన్చార్జిగా నియమించడం నా అదృష్టం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ పై ఎంతో ప్రేమ ఉంది.. సీఎం అయిన తర్వాత పర్యటన సైతం ఇక్కడినుండే మొదలు పెడతారు అని ఆమె చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించి, చెమటను ధార పోశారు..
వరంగల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదు.. ఆసలు సినిమా ముందుంది అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారు.. చెమట ధార పోశారు అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటినీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన తెలిపారు.
టాప్-3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉంటుంది.. ఇదే నా హామీ..
గుజరాత్ గాంధీనగర్‌లో జరిగబోయే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించారు. గుజరాత్‌లో పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. రాబోయే ఏళ్లలో ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు.
‘‘ ప్రపంచంలో ఈ రోజు భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 10 ఏళ్ల క్రితం భారత్ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. నేడు అన్ని ప్రధాన సంస్థలు రాబోయే కొన్నేళ్లలో భారత్ ప్రపంచంలోని 3 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉంటుందని హామీ ఇస్తున్నాను’’ అని ప్రధాని మోడీ అన్నారు. రాబోయే 25 ఏళ్లలో భారతదేశం వ్యూహాత్మక దృక్పథాన్ని ప్రధాని వివరించారు. స్వాతంత్య్రం పొంది 100 ఏళ్ల పూర్తయ్యే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
పండుగ అయిపోగానే రైతుబంధు.. కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్న్యూస్..!
ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పొంగులేటి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతుబంధుపై అపోహలు వద్దని.. పండుగ అయిపోగానే రైతులందరికీ రైతుబంధు అందుతుందని తుమ్మల తెలిపారు. ఎంత అహంకారం ఉన్నా.. ప్రజల ముందు దిగదుడుపే అని తెలంగాణ ప్రజలు నిరూపించారన్నారు. తెలంగాణలో కబ్జాల రాజ్యం పోవాలని ప్రజలు కోరుకున్నారని.. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా తీర్చిదిద్దారు
నేను గతంలో సవాల్ చేసినట్టు 10కి 10 సీట్లు అన్నానని, అన్నం తింటుంటే ఓ మెతుకు జారిపడ్డట్టు ఓ స్థానం పోయిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగిలిన 9 స్థానాల్లో మనమే గెలిచామన్నారు. మమ్మల్ని ఓడించాలని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని, అధికారులను ఉపయోగించి అక్రమ కేసులు పెట్టారన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ ఏ మీటింగ్ లో మాట్లాడినా మా ఇద్దరి గురించేనన్నారు. కరటక ధమణుకలు అని మాకు పేరు పెట్టారని, డబ్బు మదం తో మాట్లాడుతున్నారు అని అన్నాడన్నారు. మేమేమన్న అధికారంలో ఉన్నామా అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులుగా ఉన్నామా ప్రజల సొమ్ము దోచుకోవడానికి, కాంట్రాక్టులన్నీ ఆయన గారి బంధువులకు ఇచ్చి తెర వెనకాల ఉండి నడిపించారన్నారు. అధికార మదం మీకుండేదని, మేము సేవకులమన్నారు. శక్తి వంచన లేకుండా మంత్రులందరం ప్రజల కోసమే పనిచేస్తామని, అసెంబ్లీ లో పోట్ల గిత్తళ్ల వ్యవహరించారన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా తీర్చిదిద్దారన్నారు. గత ప్రభుత్వ అప్పులను ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి గారు వివారిస్తుంటే గొడవకు దిగారని, అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలు చేసామన్నారు.
బస్సులో కోడిని మర్చిపోయిన ప్రయాణికుడు.. బోను ఏర్పాటు చేసి బాగాగోగులు చూస్తున్న ఆర్టీసీ
నిత్యం ప్రయాణీకులతో బిజీ బిజీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్ లో ఓ కోడి పుంజును కట్టి పడేశారు. బస్సుల్లో ప్రయాణీకులు ఉండాల్సిన చోట ఉండడం ప్రత్యేకంగా నిలిచింది. ఇంతకీ ఈ కోడి ఎక్కడ నుండి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు. అంతేకాదు దాని బాధ్యతలు ఆర్టీసీ యాంత్రాంగంపై పడడంతో బోను ఏర్పాటు చేసి దానా, నీటిని అందిస్తున్నారు. ఇంతకీ ఆ కోడి వివరాలేంటి… ఎక్కడినుండి వచ్చిందో తెలుసుకుందాం…
ఎయిరోస్పేస్ రంగానికి తెలంగాణ స్వర్గధామం
ఎయిరో స్పేస్ రంగానికి తెలంగాణ స్వర్గధామమని, దేశంలోనే ఇక్కడ శక్తివంతమైన ఎయిరో స్పేస్ ఎకోసిస్టమ్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, వాణిజ్య, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఎయిరో స్పేస్ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు.
శంషాబాద్ లోని ఆదానీ డిఫెన్స్ మరియు ఎయిరోస్పేస్ సెంటర్ లో భారతీయ నేవీ కోసం ఆ ఆదానీ సంస్థ దేశీయంగా తయారు చేసిన ద్రిష్టి 10 స్టార్ లైనర్ అన్ మానవరహిత ఏరియల్ వాహనం (యూఏవీ) ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ఏపీలో విన్నింగ్ షాట్ కొట్టడానికే మాణిక్కం ఠాకూర్ వచ్చాడు..
ఏపీ కాంగ్రెస్ కొత్త ఊపందుకుంది. ఏపీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ గా మాణిక్కం ఠాకూర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ మార్పులు కనిపిస్తోంది. అందుకు తోడు.. షర్మిల కూడ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీలో జోష్ కనిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కొందరు పార్టీలో చేరారు. సినిమా ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి, బీఆర్ఎస్ నేతలు, జె.డి.లక్ష్మీనారాయణ అనుచరులు, వైసీపీ, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరారు.
జగన్ నిరుపేదల పక్షపాతి.. త్వరలో వైసీపీలో జాయిన్ అవుతా..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్‌తో కీలక భేటీ అనంతరం కేశినాని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను టీడీపీలో తీవ్రంగా అవమానించారని, తన రాజీనామాను ఆమోదించిన అనంతరం వైసీపీలో చేరతానని ఆయన తెలిపారు. టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం పని చేశానని, చంద్రబాబు చెబితే కొందరికి నెల వారీ జీతాలు కూడా ఇచ్చానన్నారు. 2014కు ముందు టీడీపీలో చేరతానంటే.. చాలా మంది మా సామాజిక వర్గం వాళ్లే నన్ను మందలించి చేరొద్దన్నారని కేశినేని నాని పేర్కొన్నారు. రాజకీయాల కోసం రూ. 2 వేల కోట్ల ఆస్తులను అమ్ముకున్నానని ఆయన వెల్లడించారు. చంద్రబాబు తీరుతో వ్యాపారాన్ని కూడా ఆపేశానన్నారు.