ఏపీ కాంగ్రెస్ కొత్త ఊపందుకుంది. ఏపీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ గా మాణిక్కం ఠాకూర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ మార్పులు కనిపిస్తోంది. అందుకు తోడు.. షర్మిల కూడ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీలో జోష్ కనిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కొందరు పార్టీలో చేరారు. సినిమా ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి, బీఆర్ఎస్ నేతలు, జె.డి.లక్ష్మీనారాయణ అనుచరులు, వైసీపీ, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరారు.
Snoring: రాత్రిపూట గురకతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!
ఈ సందర్భంగా సీడబ్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారో చెప్పలేమన్నారు. క్రికెట్ లో విన్నింగ్ షాట్ కొట్టిన వాడు గుర్తుంటాడు.. తెలంగాణలో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా మాణిక్కం ఠాకూర్ విన్నింగ్ షాట్ కొట్టాడని తెలిపారు. అదే తరహాలో.. ఏపీలో విన్నింగ్ షాట్ కొట్టడానికే మాణిక్కం ఠాకూర్ వచ్చాడని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. షర్మిల, రాహుల్ ను ప్రధానిని చేయడానికే వస్తున్నా అని వచ్చారని చెప్పారు. షర్మిల రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. తమ వాణిని అసెంబ్లీలో వినిపించడమే తమ లక్ష్యం అని రఘువీరారెడ్డి తెలిపారు. తమిళనాడులో కాంగ్రెస్ ను ఎవరూ వీడలేదని.. ఏపీలో కాంగ్రెస్ నుంచి కొందరు వెళ్ళిపొయారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని.. రాహుల్ ప్రధాని అయితే మొదటి సంతకం ఏపీ ప్రత్యేక హోదా పైనే అని రఘువీరా పేర్కొన్నారు.
Karnataka: కర్ణాటక అసెంబ్లీ ముందు 8 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే..?
అనంతరం.. ఏపీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్ మాట్లాడుతూ.. మనకు 9 రోజులే సమయం ఉందన్నారు. మనకు చివర 5 ఓవర్లే ఉన్నాయి గెలవడానికి అని సూచించారు. మోదీ వస్తే పోలవరం రాదు.. మెట్రో రాదు అని అన్నారు. కాంగ్రెస్ వస్తే రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరుతాయన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఏపీ నుంచీ 25 ఎంపీలు రావడం చాలా పెద్ద మార్పు తెస్తుందని తెలిపారు. కాగా.. బీజేపీపై విమర్శలు జల్లు కురింపించారు. బీ అంటే బాబు, జే అంటే జగన్, పీ అంటే పవన్ అంటే బీజేపీ అని అన్నారు. ఆ బీజేపీని మనం ఏపీలో ఓడించాలని తెలిపారు.