టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవాళ్టి నుంచి ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’కు రెడీ అయింది. 133 దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల సీఈఓలో పాల్గొనే ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ నేడు ప్రారంభించారు.
వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారిని అరుణ్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు సంబంధించి చర్చించుకున్నారు. గతంలో ప్రతిపాదించిన వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఎంతో…
ఘజియాబాద్ పేరు మార్చే ప్రతిపాదనను మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. హర్నంది నగర్, గజ్ ప్రస్థ, దూధేశ్వరనాథ్ నగర్ అనే మూడు పేర్లను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు పంపనున్నట్లు ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) మేయర్ సునీతా దయాల్ వెల్లడించారు.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి నారాయణ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేతల మధ్య పోరు చాలా రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నారాయణపై అనిల్ విరుచుకుపడ్డారు. నెల్లూరు నగరంలో ఏ బిల్డర్ లేదా, వ్యాపారినైనా గుండెమీద చేయి వేసుకొని చెప్పమనండి.. అనిల్ నుంచి ఫోన్ వచ్చిందని. వ్యాపారస్తులను ఏనాడు తాను ఇబ్బంది పెట్టలేదని అనిల్ చెప్పారు.
దేశంలోని మారుమూల ప్రజల్లోనూ మార్పు తీసుకురావడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిందని మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఈ కార్యక్రమం రాజకీయాలకు వేదిక కానేకాదని, కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రకు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేయడంతోపాటు లబ్దిదారులంతా ఇక్కడికి తీసుకొచ్చి ప్రజలను భాగస్వాములను చేసిన…
Lakshadweep vs Maldives: భారతదేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి ఇది విదేశాల కంటే తక్కువ కాదు. ఇక్కడ అనేక అందమైన ద్వీపాలు, బీచ్లు ఉన్నాయి. వీటిని చూడటానికి ప్రజలు సుదూర ప్రాంతాలు, విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ఇటీవల అటువంటి అందమైన భారతదేశ ద్వీపం నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ స్నార్కెలింగ్ చేస్తూ కనిపించారు. ఆయన పర్యటన అనంతరం లక్షద్వీప్ నిరంతరం ముఖ్యాంశాలలో ఉంది. అదే సమయంలో,…
విజయవాడ ఏసీబీ కోర్టులో రెడ్ బుక్ అంశంలో నారా లోకేశ్ పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. లోకేశ్ తన ప్రసంగాల్లో రెడ్ బుక్ అంశం ప్రస్తావనకు తెస్తుండడం పట్ల.. సీఐడీ గత నెలలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్ పేరుతో లోకేశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఐడీ తెలిపింది. ఈ క్రమంలో.. లోకేశ్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ పై…
MCRHRDలో ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. ఈ సందర్భంగీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి.. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామన్నారు. నియోజకవర్గాల్లో నిజాయితీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని,…
సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ తన పార్టీని ఒక ‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా నడుపుతున్నాడని విమర్శించారు. జగన్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో వ్యవహరిస్తున్న తీరు ప్రైవేటు కంపెనీని నడుపుతున్నట్లుగా ఉందని ఆరోపించారు. మళ్లీ జగన్ అధికారంలోకి రావడానికి ప్రజలు ససేమిరా ఇష్టపడడం లేదని అన్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్నే బదిలీ చేయాలని వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు. 12 మంది దళిత శాసన…