ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీ.. మార్పులు చేర్పులు చేస్తుంది. అందులో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్.. సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. కాగా.. అమర్నాథ్ నియోజకవర్గ మార్పుకు సంబంధించి చర్చలు జరిగాయని అందరూ అనుకున్నారు.
Read Also: Punjab: ‘హిట్ అండ్ రన్ లా’ వ్యతిరేకంగా టవర్ ఎక్కిన ట్రక్ డ్రైవర్..
సీఎంతో అమర్నాథ్ సమావేశం అనంతరం మాట్లాడుతూ.. మార్పులపై రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. తన భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. తనకు ఎలాంటి గాభరా లేదని చెప్పారు. పెందుర్తి, చోడవరం అంటూ ప్రచారాలు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ కు అమర్నాథ్ అంటే ఏంటో తెలుసు.. తనకు ఏమి చెయ్యాలో ఆయనకి తెలుసని చెప్పారు. తాను పార్టీకి ఎలాంటి సేవ చేయాలో సీఎం జగన్ కు తెలుసన్నారు. మరోవైపు.. ఈ నెలలో కర్నూల్ లో రూ. 2,500 కోట్లతో అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ శంకుస్థాపన పై చర్చించినట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు.
Read Also: Buddha Venkanna Counter: కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బుద్దా వెంకన్న