రేపటి (జనవరి 11) నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. అయితే.. జట్టులోకి వికెట్ కీపర్‌లుగా సంజూ శాంసన్, జితేష్ శర్మలను తీసుకున్నారు. ఈ సందర్భంగా.. రిషబ్ పంత్ ప్రస్తావన తీసుకొచ్చారు సునీల్ గవాస్కర్. అతను ఒంటికాలిపై నిలబడగలిగినప్పటికీ.. 2024 ప్రపంచకప్ నాటికి తిరిగి జట్టులోకి రావాలని గవాస్కర్ తెలిపాడు. ఎందుకంటే అతను ప్రతి ఫార్మాట్‌లో గేమ్ ఛేంజర్ పాత్ర పోషిస్తాడు.
Read Also: Discount Challan Date Extended : వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడుపు పొడిగింపు
ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “జట్టులో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఉండటం మంచిది. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి అంటే రిషబ్ పంత్ ఒక్క కాలు అయినా నిలబడగలిగితే 2024 ప్రపంచకప్ నాటికి తిరిగి జట్టులోకి రావాలి. ఎందుకంటే అతను ప్రతి ఫార్మాట్‌లో గేమ్ ఛేంజర్ పాత్ర పోషిస్తాడు. నేను సెలెక్టర్ అయితే, అతని పేరును నంబర్ వన్ స్థానంలో ఉంచుతాను. అని చెప్పాడు. దురదృష్టవశాత్తూ రిషబ్ పంత్ ఎంపిక కాకపోతే, కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తే అది కూడా బాగుంటుందని గవాస్కర్ అన్నాడు. రాహుల్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా ఉందని పేర్కొన్నాడు.
Read Also: Sandeep Lamichhane: అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానేకు 8 ఏళ్ల జైలు శిక్ష..
కాగా.. రిషబ్ పంత్ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2022లో రోడ్డు ప్రమాదంలో గాయపడినప్పటి నుంచి మళ్లీ మైదానంలో కనపడలేదు. అయితే.. అతను ప్రపంచకప్ 2024 వరకు ఫిట్‌గా ఉన్నాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.