Kakinada: కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం.. అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు
- కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమలో తనిఖీలు చేపట్టండి
- పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
- కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మరణంపై విచారణ చేపట్టండి
- అటవీ శాఖ ఉన్నతాధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమలో తనిఖీలు చేపట్టండని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. కాకినాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రై.లి. వ్యవహారంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్యకారక దుర్గంధం వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సంస్థ నుంచి ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు విడుదల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
Read Also: Mega Job Mela: జనవరి 3న నారావారిపల్లెలో మెగా జాబ్ మేళా..
Also Read
- Deputy CM Pawan Kalyan: కాకినాడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. అభివృద్ధి, స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Minister Narayana: అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ శ్రీ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శ్రీ శంకరరావుతో ఫోన్‌లో మాట్లాడారు. యూనివర్సల్ బయోఫ్యూయల్స్ సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో..? లేదో? పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పరిశీలన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ముడి పదార్థాలు వాడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఫలితంగా ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు వెలువడుతున్నాయని తేలింది. దీనిపై మరింత లోతుగా తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: Fake IPS: నకిలీ ఐపీఎస్ బాగోతం బయటపెట్టిన కుటుంబ సభ్యులు..
మరోవైపు.. కాకినాడ బీచ్ రోడ్, ఏపీఐఐసీ, వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆలివ్ రిడ్లీ తాబేళ్ళ మరణానికి కారణాలు విచారించి.. దీనికి కారణం అవుతున్న వారిపై చర్యలు చేపట్టాలని, వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ & హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ చిరంజీవి చౌధరిని పవన్ కల్యాణ్ ఆదేశించారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!