ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిరుద్యోగులకు మంచి అవకాశం.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్. నారావారిపల్లెలో మెగా జాబ్ మేళా జరగబోతోంది. భారీగా ఉద్యోగాలు లభించనున్నాయి. ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. జనవరి 3వ తేదీన నారావారిపల్లెలో 20 కంపెనీలతో మెగా జాబ్ మేళా జరుగనుంది. మెగా జాబ్ మేళాకు సంబంధించి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పోస్టర్ ఆవిష్కరించారు.
Read Also: Fake IPS: నకిలీ ఐపీఎస్ బాగోతం బయటపెట్టిన కుటుంబ సభ్యులు..
5వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ వరకు చదువుకున్న నిరుద్యోగులకు ఇదొక సువర్ణావకాశం. 18 సంవత్సరాల వయసు నుంచి 35 సంవత్సరాల వయస్సు వరకు రూ.22 వేల జీతం ఇవ్వనున్నారు. కాగా.. 1200 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రెండు సాఫ్ట్ వేర్ కంపెనీలతో పాటు.. కొన్ని ఇండస్ట్రీలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. మాటలు చెప్పే ఎమ్మెల్యేను కాదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని చెప్పారు. మరోవైపు.. రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతిపక్షం ఎన్ని ఆరోపణలు చేసిన వారి విజ్ఞతకు వదిలేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Read Also: Abhishek Banerjee: మన్మోహన్ సింగ్ మృతిపై క్రీడా, సినీ ప్రముఖుల ‘నిశ్శబ్దం’ ఎందుకు?