మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు. ఆయనను కలిసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎవరు మరిచి పోరు.. కాంగ్రెస్ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరం, సంస్కార హీనమని విమర్శించారు. వాజ్ పెయి అంత్యక్రియలు ఎలా జరిగాయో.. అలానే మన్మోహన్ సింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.. ఆ బాధ్యతలను అమిత్ షా కి అప్పగించారని తెలిపారు. అంతేకాకుండా.. స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని అనుకోవడం.. బోర్ల పడడం పరిపాటి అయిందని కిషన్ రెడ్డి విమర్శించారు.
Read Also: Unstoppable With NBK S4: బాలయ్యతో రామ్ చరణ్.. మాములుగా ఉండదు మరి!
నెహ్రూ కుటుంబం మొదటి నుండి.. ఆ కుటుంబానికి చెందని వారు ప్రధాని అయినా, రాష్ట్రపతి అయిన అవమానించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తుందని ఆరోపించారు. మన్మోహన్ సింగ్‌ను ఎన్ని సార్లు అవమానించి అగౌరవ పరిచారోనని పేర్కొన్నారు. ఆర్డినెన్సును చింపిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు దొంగ ప్రేమను ఒలక బోస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ అహంకారపూరిత దివాలాకోరు తనాన్ని దేశ మేధావులు ఖండిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ గౌరవార్థం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకించారని తెలిపారు. 2జి కుంభకోణానికి కారణం మన్మోహన్ సింగ్ ఆలోచనలకి విరుద్ధంగా సోనియా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. తమ కనుసన్నల్లో పని చేయాలని భావనతో సోనియా, రాహుల్ ఉండే వారని.. బలవంతంగా సంతకాలు పెట్టించారని కిషన్ రెడ్డి తెలిపారు. సోనియా, రాహుల్‌లు షాడో పీఎంలుగా వ్యవహరించారని అన్నారు.
Read Also: Bandi Sanjay: తెలంగాణ సీఎంను పవన్ కల్యాణ్ ప్రశంసించడాన్ని తప్పుపట్టిన కేంద్రమంత్రి..
కుంభకోనాలన్నింటికి కారణం సోనియా గాంధీ.. కానీ మన్మోహన్ సింగ్‌కి అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పీవీ నరసింహా రావును కాంగ్రెస్ ఎలా అవమానించిందో అందరికీ తెలుసని అన్నారు. ఒక కాంగ్రెస్ నేతకు దక్కిన గౌరవాన్ని కూడా ఆయనకి ఇవ్వలేదు.. ఏఐసీసీ కార్యాలయంలోకి ఆయన పార్థివ శరీరాన్ని రానివ్వలేదు.. ఆఫీస్‌కు తాళాలు వేశారని కిషన్ రెడ్డి తెలిపారు. అంత్యక్రియలు ఢిల్లీలో జరపనీయలేదు.. బలవంతంగా హైదరాబాద్‌కు పంపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు పీవీకి స్మారక కేంద్రం ఏర్పాటు చేయలేదని అన్నారు. 2015లో మోడీ ప్రభుత్వం ఢిల్లీలో పీవీ స్మారక కేంద్రంను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రధాన మంత్రుల సంగ్రహాలయాన్ని మోడీ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ క్షమించరని కిషన్ రెడ్డి తెలిపారు.