టీమిండియా, అఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో అఫ్ఘాన్ బౌలర్లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రింకూ సింగ్ చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (121), రింకూ సింగ్ (69) అజేయంగా నిలిచారు. ఒకానొక దశలో టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రోహిత్, రింకూ నిలకడగా ఆడి అఫ్ఘాన్ బౌలర్లకు ఊచకోత…
రేపు(గురువారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. మేనల్లుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్కు సీఎం జగన్ హాజరుకానున్నారు. రేపు సాయంత్రం 6.15 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరనున్నారు.
జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ (JSW Energy) అనుబంధ సంస్థ JSW నియో ఎనర్జీ, తెలంగాణ లో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం JSW నియో ఎనర్జీ మధ్య ఈ అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. దావోస్ లో జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. ఈ కొత్త…
అయోధ్యలో బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. 5 ఏళ్ల బాలుడి రూపంలో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. మరో ఐదు రోజుల్లో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. కాగా.. బుధవారం తొలిసారిగా రామయ్య భక్తులకు దర్శనమిచ్చాడు. డప్పు, వాయిద్యాల మధ్య భారీ ఊరేగింపుతో బాలరాముడు అయోధ్య గుడిలోకి ప్రవేశించాడు. కాగా.. గురువారం గర్భగుడిలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ క్రమంలో.. బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించి పోయారు.
కేరళలోని కన్నూర్‌లో ఒంటెపై పెళ్లి ఊరేగింపుగా వెళ్లినందుకు వరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనితో పాటు 25 మంది సహచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు అభియోగాలు మోపారు. గుంపులుగా గుమికూడడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటి అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లపై వైసీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. దేవినేని అవినాష్ ఒక్క పిలుపుతో ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారని.. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి వంద మంది రావటం కూడా కూడా గగనమేనని ఎద్దేవా చేశారు.
రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలో ‘శక్తి కేంద్ర ఇన్చార్జ్ సమ్మేళనం’లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. అనంతరం.. కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో వేగవంతమైన అభివృద్ధిని నిరూపితమైన ట్రాక్ రికార్డ్, భవిష్యత్తు కోసం స్పష్టమైన విజన్ కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్ వెర్క్స్ రూ.5200 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది. డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటెన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్క్స్. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీతో సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రూ.5200 పెట్టుబడులకు వెబ్ వెర్క్స్ కంపెనీ…