Peddi Sudarshan Reddy : బీఆర్ఎస్ హయాంలో రైతులు ఏనాడు నీళ్లు రావటం లేదని అడిగిన దాఖలాలు లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లా నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గ రైతులందరు యాసంగి పంట కోసం గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గంలో మూడు, నాలుగు సంవత్సరాలుగా ఇరిగేషన్ సర్క్యుట్ ప్లాన్ ప్రాకారం గోదావరి జలాలను తీసుకువచ్చి రెండు పంటలకు నీరందించామని ఆయన వెల్లడించారు. ప్రత్యేకమైన ఏజన్సీని పెట్టుకొని సమగ్రమైన ప్రణాళిక ద్వారా సాగుకు గోదావరి నీళ్లను తీసుకువచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో లాగా రైతులకు సాగు నీళ్లు వస్తాయ రావా అని ఆందోళన చెందుతున్నారు రైతులు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఒక్కసారైనా అధికారులతో సమీక్షించారా అని ఆయన ప్రశ్నించారు. గతంలో పూడుకుపోయిన కాలువలకు పూడిక తీసి సమృద్ధిగా నీళ్లు కాలువల ద్వారా పారించామని ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సరిపోను నీళ్లు అందించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఏనాడు నీళ్లు రావటంలేదని అడిగిన దాఖలాలు లేవని, పాఖాల గోదావరి జలాల ప్రాజెక్టు బూటకమన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా.. ‘ఈరోజు దేనిని బేస్ చేసుకుని తైబంది ఇస్తామని అంటున్నారో స్థానిక ఎమ్మెల్యే చెప్పాలి. ప్రాజెక్టుల్లో నీటి నిలువలు ఉన్నా ఇప్పుడు ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీళ్లు ఎందుకు రావటంలేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. నియోజకవర్గంలో డీబీఎం 38, 40 ద్వారా 50 వేల ఎకరాల పై చీలుకు పంటలు సాగులో ఉండేవి. ఈ రోజు ఆ కాలువల ద్వారా నీరు ఎందుకు రావటం లేదు. బోర్లు, బావులు ఉన్న రైతులు కాలువ ద్వారా వచ్చే నీళ్లు వాడొద్దని అంటున్నారు ఎందుకు. పాఖాలకు నీళ్లు తీసుకువస్తే కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటామన్న నాయకులు ఈరోజు ఎక్కడికి వెళ్లారు. తైబంది నిర్ణయించిన అధికారులు తక్షణమే స్పందించి బాధ్యత వహించి రైతులకు సమాధానం చెప్పాలి.
‘ అని పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
తాజావార్తలు
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!