రాష్ట్రంలో గత పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన పలు కార్యక్రమాల వల్లనే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు బుధవారం అన్నారు. బహుమితీయ పేదరిక సూచీ 13.18 శాతం నుంచి 3.76 శాతానికి బాగా క్షీణించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం పేరుతో సాగుతున్న దుష్ప్రచారాలకు తగిన సమాధానం. తదుపరి పార్లమెంట్ ఎన్నికల కోసం నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం యొక్క సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, NITI…
3 టీ20 సిరీస్ లో భాగంగా భారత్-అఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. అటు అఫ్ఘనిస్తాన్ జట్టులో కూడా మూడు మార్పులు చేశారు. మూడో టీ20లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ జితేష్ శర్మ, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆడటం లేదు. వికెట్ కీపర్ సంజూ…
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బుధవారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే కొణతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నట్లు తెలిసింది.
గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. అందుకు సంబంధించి భారీగా రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్ లో 12.5 GWh (గిగావాట్ ఫర్ అవర్ ) సామర్థ్యముండే బ్యాటరీ సెల్ తయారు చేయనున్నట్లు ప్రకటించింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి ముఖ్యమంత్రి…
ల్లుండి విజయవాడలో అంబేడ్కర్ మహా శిల్పం ఆవిష్కరణ జరగనుంది. సీఎం జగన్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగనుది. ఈ సందర్భంగా సీఎం జగన్ అంబేడ్కర్ విగ్రహం గురించి మాట్లాడారు. విజయవాడలో ఏర్పాటు చేసుకున్న అంబేడ్కర్ మహా శిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికమని ఆయన వ్యాఖ్యానించారు.
కోతులు చేసే వింత చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తే.. ఒక్కోసారి చిరాకు తెప్పిస్తాయి. అయితే ఇప్పుడు.. ఓ కోతి చేసిన వింత చేష్టకు ఓ వ్యక్తి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంతకు అతను దగ్గర నుంచి ఏం తీసుకెళ్లిందని అనుకుంటున్నారా.. మొబైల్ ఫోన్. అది కూడా మాములు ఫోన్ కాదు.. ఐఫోన్.
చంద్రబాబు అరెస్ట్‌పై అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొదటిసారిగా డీఐజీ స్థాయి అధికారిని అరెస్టు కోసం పంపించారని.. రహదారిపై ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం హెలికాప్టర్లో తీసుకెళ్తామని చెప్పిందని.. జైలు మాన్యువల్‌ను కూడా కాదని కూడా చంద్రబాబుకి ఎన్నో సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందని అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.
శంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ ఈరోజు తన నాల్గవ ఎలక్ట్రిక్ కారు 'టాటా పంచ్ ఈవీ'ని విడుదల చేసింది. రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లు, రెండు విభిన్న డ్రైవింగ్ పవర్ట్రెయిన్లతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ దేశంలోనే అత్యంత సురక్షితమైన ఈవీ కారు అని కంపెనీ పేర్కొంది.
యావత్ దేశం దృష్టి మొత్తం ఇప్పుడు అయోధ్య వైపు ఉంది. రామ మందిర ప్రారంభోత్సవం కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా.. రాంలాలా కోసం వివిధ రాష్ట్రాల నుంచి రకరకాల బహుమతులు వస్తున్నాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు చెందిన యువ కళాకారుడు రాముడి కోసం ప్రత్యేకంగా తయారు చేశాడు.
ధరణి కీలకమైన అంశమని, ఇది లక్షల మంది రైతుల భూమి హక్కుల సమస్య అని అన్నారు ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ నాటికి ధరణి తీసుకువచ్చి ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యిందని, ధరణి అనేక సమస్యలు తెచ్చి పెట్టింది. ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలకు, రైతులకు ధరణి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని, కమిటీ, ప్రభుత్వం పై పెద్ద భాద్యత ఉంది. తొందర పాటు వల్ల ఏదైనా…