కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో తెలుగు ప్రజల ఆశాజ్యోతి.. తెలుగు ప్రజల గుండెచప్పుడు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పన్నాగా వెంకటేశ్వర్లు స్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని.. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ లో రామోజీ ఫౌండేషన్ సహకారంతో నూతన ఆర్టీఏ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిధిగా హాజరై ఆర్టీఏ నూతన కార్యాలయాన్ని రవాణా & బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కే. శశాంక్, జడ్పి చైర్మన్ తీగల అనితారెడ్డి, తుర్కాయంజల్ మున్సిపల్ చైర్మన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్…
జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలోని నౌషేరాలో ల్యాండ్‌మైన్ పేలింది. ల్యాండ్‌మైన్‌పై కాలుపెట్టడంతో పేలుడు సంబవించి భారత ఆర్మీ జవాన్ వీరమరణం పొందాడు. పేలుడులో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఎల్ఓసీ వెంబడి పెట్రోలింగ్ చేస్తుండగా ఓ జవాన్ ల్యాండ్ మైన్ పై అడుగుపెట్టడంతో ప్రమాదవశాత్తు ట్రిగ్గర్ అయ్యింది. దీంతో పేలుడు సంభవించి ముగ్గురు ఆర్మీ జవాన్లక తీవ్ర…
సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం అర్థరాత్రి ఒక కార్గో షిప్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఆ తర్వాత భారత నావికాదళం చర్యలు చేపట్టింది. ఈ దాడిపై ఓడ సిబ్బంది భారత నౌకాదళానికి అత్యవసర హెచ్చరిక (SOS) పంపింది. సమాచారం అందిన వెంటనే డిస్ట్రాయర్ యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నాన్ని పంపినట్లు భారత నావికాదళం వెల్లడించింది.
ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ గురువారం అసెంబ్లీలో నామినేషన్లు దాఖలు చేశారు. వారి వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి దీపదాస్ మున్షీ తదితరులున్నారు. శాసనమండలికి ఉప ఎన్నికలు జనవరి 29న జరగనున్నాయి. గత ఏడాది డిసెంబరు 9న ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు అసెంబ్లీ ఎన్నికల్లో…
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. రోజురోజుకు పెనమలూరు పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెనమలూరు ఇంఛార్జిగా మంత్రి జోగి రమేష్ నియామమైన సంగతి తెలిసిందే.
గవర్నర్ కోటా రెండు ఎమ్మెల్సీల భర్తీపై తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు. తమ ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, కె. సత్యనారాయణ దాఖలు చేసిన రెండు పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆ…
ఆంధ్రప్రదేశ్‌లోని రెండు వర్సిటీలకు వీసీలను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నియామకమయ్యారు. ప్రసాద్ రెడ్డి నియామకాన్ని ఖరారు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రధాని మోదీ కేరళ టూర్ పై కాంగ్రెస్ విమర్శల వర్షం గుప్పించింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ తరచూ కేరళలో పర్యటించడం వల్ల బీజేపీ అక్కడ ఖాతా తెరవబోదని కాంగ్రెస్ పేర్కొంది. కాగా.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వి.డి. భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి మతం, ప్రార్థనా స్థలాలను రాజకీయాలతో కలపాలని చూస్తోందని కాంగ్రెస్ నేత సతీశన్ ఆరోపించారు.
ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం పరువు పోతోందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బుధవారం అన్నారు. ప్రజావాణిలో హాజరయ్యి ప్రజల సమస్యల పరిష్కారానికి తప్పకుండా హాజరవ్వాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజా సంబంధాల సాధనగా మారిందని అన్నారు. రెండు వారాల పాటు కార్యక్రమానికి హాజరైన ఆయన క్యాబినెట్ సహచరులు తమ ఫిర్యాదులకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో అందరు ప్రాతినిధ్యాలు ఇవ్వడానికి వస్తున్న ప్రజలను కలవడం మానేశారు.…