MLC Elections: నామినేషన్లు దాఖలు చేసిన బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యేల కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ గురువారం అసెంబ్లీలో నామినేషన్లు దాఖలు చేశారు. వారి వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి దీపదాస్ మున్షీ తదితరులున్నారు.
శాసనమండలికి ఉప ఎన్నికలు జనవరి 29న జరగనున్నాయి. గత ఏడాది డిసెంబరు 9న ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాజీనామా చేయడంతో శాసనమండలిలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. అదే రోజు ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అసెంబ్లీలో వారి బలాన్ని పరిశీలిస్తే మండలిలోని రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. శాసనమండలిలో బీఆర్‌ఎస్‌కు 27 సీట్లు ఉండగా, కాంగ్రెస్‌కు రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి.
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
అంతకుముందు గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పరామర్శించారు. తమ్మినేని వీరభద్రం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా సీపీఎం నేతను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!