Penamaluru Politics: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. రోజురోజుకు పెనమలూరు పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెనమలూరు ఇంఛార్జిగా మంత్రి జోగి రమేష్ నియామమైన సంగతి తెలిసిందే. పెనమలూరు ఇంఛార్జిగా మంత్రి జోగి రమేష్ నియామకాన్ని పార్టీ నేత పడమట సురేష్‌బాబు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అసమ్మతి రాగాల నడుమ మంత్రి జోగి రమేష్ పడమట సురేష్ ఇంటికి వచ్చారు. జోగి రమేష్‌కు వ్యతిరేకంగా 2 రోజులుగా నియోజక వర్గంలో ఫ్లెక్సీలు భారీగా వెలిశాయి. అసమ్మతి రాగాల నేపథ్యంలో జోగి రమేశ్, పడమట సురేశ్ బాబు భేటీ ఆసక్తిగా మారింది. ఎన్నికల్లో సహకరించాలని పడమట సురేశ్ బాబుకు మంత్రి జోగి రమేష్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
Read Also: Andhrapradesh: ఏపీలో రెండు యూనివర్సిటీలకు వీసీల నియామకం
ఇటీవల పెనమలూరు ఇన్‌ఛార్జ్‌గా జోగి రమేష్‌ను నియమించడం సరైన నిర్ణయం కాదంటూ సురేశ్ బాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలో ఎలాంటి పరిచయాలు లేని వ్యక్తిని ఇన్‌ఛార్జ్‌గా నియమించడంపై అధిష్టానం పునరాలోచించాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. మొదటి నుంచి వైసీపీ కోసం కష్టపడిన పడమటి సురేష్‌బాబుకు టికెట్ కేటాయించాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని కొన్ని ప్రధాన కూడళ్లలో జోగి రమేష్ వద్దు.. స్థానికులకే టికెట్ కేటాయించాలనే డిమాండ్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మరో వైపు ఫ్లెక్సీల తొలగింపు కూడా చర్చనీయాంశమైంది. ఈ అసమ్మతుల నేపథ్యంలో జోగి రమేష్ నియోజకవర్గంపై దృష్టి సారించారు.