రైతు మల్లికార్జున రెడ్డి చేస్తున్న ప్రకృతి వ్యవసాయం అందరికీ ఆదర్శమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట దిగుబడి రెట్టింపు చేసి లాభాలు ఆర్జించడమే కాకుండా పర్యావరణాన్ని, మనుషుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు క్రుషి చేస్తున్నారని పేర్కొన్నారు. రసాయన ఎరువులు వాడే రైతాంగంతోపాటు నేటి యువత మల్లికార్జున రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా…
రిపబ్లిక్ డేను దృష్టిలో ఉంచుకుని.. జనవరి 26న జమ్మూకశ్మీర్‌లో దాడికి ప్లాన్ చేశామని ఉగ్రవాది జావేద్ మట్టూ తెలిపాడు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం విచారణలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యుడిగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. హిజ్బుల్ ముజాహిదీన్ A++ కేటగిరీకి చెందిన ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ ఈ నెల జనవరి 4న అరెస్టయ్యాడు. కాగా.. అతన్ని పోలీసులు విచారించగా, ఈ విషయం బయటపడింది.
సైబరాబాద్ పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షల అమలు చేస్తున్నామన్నారు ట్రాఫిక్ డీసీపీ మాదాపూర్ డీవీ శ్రీనివాస్. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ట్రాఫిక్ రద్దీ దృశ్య నిబంధనలు కటినతరం చేసామని, సైబరాబాద్ లిమిట్స్ లో ట్రాఫిక్ వాయిలేశన్ 11వేల కేసులు నమోదు చేసామన్నారు. రాంగ్ రూట్ లో వాహనం నడిపి ఆక్సిడెంట్ చేస్తే 304 పార్ట్2 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హేవి వాహనాలు డిసిఎం, వాటర్ ట్యాంకర్స్, ఆర్ ఎంసీ, జేసీబీ, ట్రాక్టర్ వాహనాలు ఉదయం…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల గురించి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి తాను టికెట్ ఆశించడం లేదని ఆయన చెప్పారు. కరీంనగర్ జిల్లా ఇళ్ళందకుంట మండలం లక్ష్మాజిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. తనకు మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.
తమిళనాడులోని కాంచీపురంలో ఆలయ పూజారులు ఒకరి ఒకరు కొట్టుకున్నారు. అదేంటి.. పూజారులు కొట్టుకోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. నిజమేనండీ. వారు కొట్టుకున్నది ఒక పాట పాడే విషయంలో. నిజానికి.. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది. ఈ యాత్రకు పూజారులు భారీగా తరలి వస్తారు. కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు వడకలై, టెంకలైలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. అంతేకాకుండా.. చంపేస్తామంటూ…
రెండు రోజుల క్రితం టెహ్రాన్ దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ గురువారం ఇరాన్‌లోని సిస్తాన్-ఓ-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై దాడి చేసింది. ఇస్లామాబాద్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇస్లామాబాద్‌లోని ఒక ప్రకటనలో, పాకిస్తాన్ భద్రతా దళాలు సమన్వయంతో , నిర్దిష్ట లక్ష్యంగా ఖచ్చితమైన సైనిక దాడులను నిర్వహించాయని పేర్కొంది.
పార్టీ ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ కి గుర్తు చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయని, శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలన్నారు. శాసనమండలి సభ్యులు కూడా…
అయోధ్యలోని శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరామ మందిరంలోని గర్భగుడిలో రామ్‌లాలా కొత్త విగ్రహం 'ప్రాణ్‌ప్రతిష్ఠ' కార్యక్రమం సోమవారం జరగనుంది. ఈ వేడుకను ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్నారు.
యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ (SIGH) హైదరాబాద్ లో తమ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను ఇక్కడ తయారు చేస్తారు. రాబోయే రెండు మూడు ఏండ్లలో అందుకు అవసరమయ్యే రూ.231.5 కోట్ల పెట్టుబడులు పెడుతామని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఈ ఫెసిలిటీ ఏర్పాటుతో హెల్త్ కేర్…
దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ఇన్స్టిట్యూట్ మరో ఆత్మహత్య వార్త సంచలనం రేపుతుంది. నెల రోజుల్లో ఇది ఆత్మహత్య ఘటన. ఇంతకు ముందు కొన్ని రోజుల్లోనే రెండు ఆత్మహత్య ఘటనలు నమోదయ్యాయి. ఆత్మహత్యలకు ప్రసిద్ధి చెందిన కాన్పూర్ ఐఐటీలో మరోసారి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ సంస్థ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రియాంక అనే పీహెచ్డీ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని కనిపించింది. దీంతో పోలీసు యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారితో పాటు ఫోరెన్సిక్ బృందం…