జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని నౌషేరాలో ల్యాండ్‌మైన్ పేలింది. ల్యాండ్‌మైన్‌పై కాలుపెట్టడంతో పేలుడు సంబవించి భారత ఆర్మీ జవాన్ వీరమరణం పొందాడు. పేలుడులో మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఎల్ఓసీ వెంబడి పెట్రోలింగ్ చేస్తుండగా ఓ జవాన్ ల్యాండ్ మైన్ పై అడుగుపెట్టడంతో ప్రమాదవశాత్తు ట్రిగ్గర్ అయ్యింది. దీంతో పేలుడు సంభవించి ముగ్గురు ఆర్మీ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
Read Also: Indian Navy: అరేబియా సముద్రంలో డ్రోన్ దాడి.. స్పందించిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్
వెంటనే వారిని ఉధంపూర్ లోని కమాండ్ ఆసుపత్రికి తరలించగా.. ఒక సైనికుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నట్లు.. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. కాగా మరణించిన సైనికుడు వివరాలు భారత ఆర్మీ ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటన గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో జరిగింది.
Read Also: RJ Balaji: థియేటర్లలో బంధించి చూపిస్తున్నారు… ‘యానిమల్’పై తమిళ హీరో స్ట్రాంగ్ కామెంట్స్
ఇదిలా ఉంటే.. గణతంత్ర దినోత్సవం, అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన వేడుకలకు ముందు జమ్మూ కాశ్మీర్‌లో భద్రతను పెంచారు. ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉండేలా భారత్-పాకిస్తాన్ సరిహద్దుతో సహా మొత్తం జమ్మూ ప్రాంతంలో భద్రతా బలగాలు, పోలీసులను అప్రమత్తం చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.