ఆదిలాబాద్ జిల్లా బజరహత్నూర్ మండలం చిన్న మియ్యతండా గ్రామ అడవుల్లో గురువారం చిరుతపులి ఆవును చంపింది. చిరుతపులి దాడి చేయడంతో ఓ రైతుకు చెందిన ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. అడవిలో పశువులను మేపుతున్న గొర్రెల కాపరులు ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిన్న మియ్యతండా, శ్యాంరావుగూడ గ్రామాలకు చెందిన స్థానికులు మాట్లాడుతూ.. చిరుతలు నిర్ణీత వ్యవధిలో పశువులను చంపేస్తున్నాయని, దీంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ముంపు నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు…
గుజరాత్లోని వడోదరలో తీవ్ర విషాదం నెలకొంది. హర్ని సరస్సులో పడవ బోల్తా పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పడవలో ఉన్న వారు ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. మొత్తం పడవలో 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఎవరూ కూడా లైఫ్ జాకెట్లు ధరించలేదని సమాచారం అందుతోంది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సరస్సులో మునిగిపోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు…
లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో రామరాజ్యమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. హిందువులు ఐక్యం కావాలన్నారు. ఈ నెల 22న అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దేవాలయాలకు రక్షణ అని ఆయన అన్నారు. పసుపు బోర్డు ప్రక్రియ మొదలయ్యిందని, ఈ సీజన్ లో పసుపు ధర 10 వేలకు తగ్గదన్నారు. 20…
అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు భారతీయ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం తర్వాత 'ఆస్తా' పేరుతో స్పెషల్ ట్రైన్లు నడుపుతామని తెలిపింది. మొత్తం 200కి పైగా ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా 66 వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ అయోధ్యకు చేరుకుంటాయని పేర్కొంది. కాగా.. రామాలయానికి వెళ్లే భక్తుల కోసం ఒక్కో రైలులో 22 కోచ్లు ఉంటాయి. భక్తుల డిమాండ్ను బట్టి రైళ్ల సంఖ్యను తర్వాత పెంచనున్నారు.…
ఖమ్మం నుంచి అశ్వరావుపేట మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన బ్రిడ్జి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న ముగ్గురు కూలీలు బ్రిడ్జి మించి ఒక్కసారిగా దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు.
ఛత్తీస్ గడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మారి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మావోయిస్టుల మీద దాడులు పెరిగాయి. అయితే ఆ దాడులను ప్రతిఘటించే దానిలో భాగంగా మావోయిస్టులు కూడా ఊహించని విధంగా ఎదురుదాడులు తివ్రతతరం చేస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం పామేడు వద్ద ఉన్న చింత వాగు 151 బెటాలియన్ పై మావోయిస్టులు పెద్ద ఎత్తున దాడి చేశారు. దాదాపు 2000 మంది ప్రజలతో కలిసి వచ్చి దాడులు చేశారు అయితే ఈ సమయంలో…
రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి టికెట్ తీసుకోలేదని అతి దారుణంగా కొట్టాడు రైల్వే టీటీఈ. ఈ ఘటన బరౌనీ-లక్నో ఎక్స్ప్రెస్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టికెట్ తీసుకోలేని పాపానికి మరీ ఇంత దారుణంగా ఎవరైనా కొడతారా.. టికెట్ లేకుంటే ఫైన్ వేయాలి కానీ, చేయి ఉంది కదా అని ఎలా పడితే అలా కొట్టేయడమేనా..?. ఇదిలా ఉంటే.. ఆ వ్యక్తిని అంత దారుణంగా కొడుతుంటే పక్కన ఉన్న…
రాష్ట్రంలో తాను చెప్పిన జోస్యం ప్రకారం అప్పటి మంత్రి అజయ్ తూడుచుకుపోతాడు అన్నానని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి వెల్లడించారు. అదే జరిగిందని ఆమె తెలిపారు. ఈ జిల్లాకు స్వేచ్ఛ వచ్చిందని, 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ఆమె పేర్కొన్నారు.
మహిళపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.వివాహం చేసుకుంటానని మోసం చేసిన పూడూరు గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి అనే వ్యక్తిని నిలదీసేందుకు వెళ్లిన తనపై కర్రలు,పైపులతో విచక్షణ రహితంగా నరేందర్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు దాడి చేశారని బాధితురాలు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు బుధవారం మేడ్చల్ పోలీసులు ఐపిసి సెక్షన్లు 324,342,506,509, కింద కేసు నమోదు చేశారు. పూడూరు…
గతేడాది డిసెంబర్ లో అదృశ్యమైన ఓ మహిళ మృతదేహాన్ని నవీ ముంబై పోలీసులు మంగళవారం గుర్తించారు. ఖర్ఘర్ హిల్ కాంప్లెక్స్లోని అటవీ ప్రాంతంలో ఆమె కుళ్లిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన ప్రియుడు నుంచి దూరం కావడంతో ఆమెను గొంతు కోసి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఓ వార్త కథనం తెలిపింది. మృతురాలు వైష్ణవి (19)గా గుర్తించారు. సియోన్లోని ఎస్ఐఈఎస్ కాలేజీలో చదువుతోంది. కాగా.. ఆ మహిళ 2023 డిసెంబర్…