ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో టీడీపీ నేత కేశినేని చిన్ని తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్‌కు ముఖ్య అనుచరుడుగా మారాడని.. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుకే నాని తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గడ్డకట్టిన మంచు కరగడం ప్రారంభించినప్పటి నుండి ముప్పు పెరిగింది. ఇటీవల శాస్త్రవేత్తలు ఆర్కిటిక్ ప్రాంతంలో గడ్డకట్టిన స్థితిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ‘‘ జాంబీ వైరస్’’ను గుర్తించారు. దాదాపుగా 48,500 ఏళ్లుగా ఆర్కిటిక్ ప్రాంతంలో ఇది గడ్డకట్టిన స్థితిలో ఉంది.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది. నేడు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఏప్రిల్ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వైఎస్సార్ ఆసరా పథకం నిధుల విడుదలకు సమయం ఖరారైంది. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేయనున్నారు.
ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది సమ్మెను విరమించారు. ప్రభుత్వంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు ఫలించడంతో మంగళవారం నుంచి యథావిధిగా విధుల్లోకి వెళ్లనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికారులతో కలిసి అంగన్వాడీలతో సుదీర్ఘంగా చర్చించారు.
Ayodhya : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తులు బాలరాముడిని చూసేందుకు ఎదురుచూస్తున్నారు. నేటి నుంచి సామాన్య భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కలుగుతుందని ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.
రాహుల్ గాంధీపై దాడి జరగలేదు.. కాంగ్రెస్ వారు రాద్ధాంతం చేస్తున్నారన్నారు ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల దృష్టి మరల్చడానికే రాహుల్ ప్రయత్నమని ఆయన అన్నారు. రామ మందిర నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకున్నారని, ఆలయ నిర్మాణంలో కాంగ్రెస్, బీఆరెస్, వామపక్షాలు ఎందుకు దూరంగా ఉన్నాయన్నారు. హిందువుల మనోభావాలు కాంగ్రెస్ వల్ల దెబ్బ తిన్నాయని, అయోధ్య కు రాహుల్ ఎందుకు రాలేదన్నారు. రాముడు అయోధ్యలోనే పుట్టాడని సుప్రీంకోర్టు తీర్పు…
అంగన్వాడీల అంశంపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పలు జిల్లాల్లో అంగన్వాడీలు విధుల్లో హాజరవుతున్నారని మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. రెండు మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో తిరిగి విధులకు హాజరయ్యారని.. మిగిలిన జిల్లాల్లో కూడా అంగన్వాడీలు తిరిగి విధులకు హాజరవుతున్నారని చెప్పారు.
దాదాపు మూడు సంవత్సరాల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణా శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. 2015, 2020 సంవత్సరాల అనంతరం ఈ సంవత్సరమే తెలంగాణా శకటానికి అవకాశం దక్కింది. ఈ సంవత్సరంతో పాటు వచ్చే మరో రెండేళ్ల పాటు కూడా తెలంగాణా శకటం ప్రదర్శనకు అనుమతి లభించింది. నిరంకుశ విధానాలు, రాజరిక, ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా తెలంగాణాలో ఎన్నో ప్రజా ఉద్యమాలు వచ్చాయి. దీనిలో భాగంగా కొమరం…