స్టాక్ మార్కెట్ ఈరోజు సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల కారణంగా.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయింది, నిఫ్టీ కూడా 329 పాయింట్లకు చేరుకుని నష్టాల్లో ముగిసింది. ఈ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రూ.8 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. ఈ క్షీణతలో రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కువగా నష్టపోయాయి. అంతేకాకుండా.. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అమ్మకాలపై ఎక్కువ ప్రభావం చూపాయి. సుమారు మూడు శాతం…
రాముడిని ఆయుధంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు. భద్రాచలం రాముడికి ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదని, రాహుల్ గాంధీకి వస్తున్న ఇమేజ్ ని చూసి ఓర్వలేక బీజేపీ అడ్డుపడే పనిలో ఉందన్నారు. అభివృద్ధి లేదు కానీ.. హిందు ఓట్ల మీదనే బీజేపీకి ప్రేమ అని ఆయన మండిపడ్డారు. రాముడు మీ ఒక్కడికే దేవుడా . ! . మోడీ అన్ని దేవాలయాలు తిరగవచ్చు.. కానీ రాహుల్ గాంధీ వెళ్ళాలి అంటే అనుమతి…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' అస్సాంలో కొనసాగుతుంది. కాగా.. ఈ యాత్రను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో గుహవాటి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 500 మంది కార్యకర్తలతో కలిసి మంగళవారం ఉదయం గుహవాటి నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కాగా.. కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి.. నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, బారికేడ్లను దాటుకుని రావడంతో పోలీసులు,…
సచివాలయంలో ధరణి కమిటీతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారాల కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని నిన్న తెలిపారు ధరణి కమిటీ సభ్యులు. ఈ నేపథ్యంలో మధ్యంతర నివేదికపై రెవెన్యూ శాఖ మంత్రి తో చర్చిస్తున్నారు కమిటీ సభ్యులు. రేపు సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు మరో రెండు జిల్లాలు… మొత్తం నాలుగు జిల్లాల కలెక్టర్లతో రేపు సిసిఎల్ఎలో సమావేశం కానుంది ధరణి కమిటీ. ధరణిపై వీలైనంత…
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో విజన్ కలిగి ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు అని అన్నారు. పాదయాత్ర చేసి యువత ఎదురుకుంటున్న సమస్యలు, ఉద్యోగ, ఉపాధి సమస్యలు తెలుసుకుంటూ.. రైతులు,…
వైసీపీకి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామాపై స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రాంతీయ పార్టీలలో అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
షర్మిల ఇప్పడు జగనన్న వదిలిన బాణం కాదు.. అవన్నీ పాత రోజులని సినీనటుడు, జనసేన నేత పృధ్వీ అన్నారు. ఇప్పడు షర్మిల ఇండివిడ్యువల్.. కాంగ్రెస్ పార్టీ బాణం.. పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ బాణం వల్ల వైసీపీ వారికి ఏం జరుగుతుందో చూడాలన్నారు. టీడీపీ, జనసేనల రెండు జెండాల కలయిక అద్భుతం.. ఇది మార్పుకు శుభసూచికమన్నారు
అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. డ్వాక్రా సంఘాల ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేశారు. వైఎస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని.. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు
ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళుర్పించారు. నేతాజీకి నివాళులర్పిస్తూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
అయోధ్యను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. అయోధ్య ఈవెంట్తో దేశం సంతోషంగా వుందని చాటి చెప్పే ప్రయత్నం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.