నాగార్జున సాగర్ డ్యామ్‌లో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో హైదరాబాద్ నీటి సరఫరాకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కేఆర్ఎంబీ ఆమోదించిన రెండు రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ తన అవసరాల కోసం ఐదు టిఎంసిల నీటి డ్రాయల్‌ను పూర్తి చేయడంతో, ప్రాజెక్టు కనిష్ట డ్రాడౌన్ స్థాయి (ఎమ్డిడిఎల్) 510, అడుగుల కంటే 18 టిఎంసిల నీరు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు తెలంగాణ…
అయోధ్యలోని రామమందిరంలో కొలువుదీరిన బాలరాముడు ఇకపై 'బాలక్ రామ్' గా దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. మందిరంలో కొలువుదీరిన రామ్ లల్లా ఐదేళ్ల పసిబాలుడిగా దర్శనమిస్తున్నారు. అందుకే బాలక్ రామ్ పేరును నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాకుండా.. ఆలయాన్ని బాలక్ రామ్ మందిర్ గా పిలుస్తామని తెలిపారు.
ఓ విద్యార్థికి ఇద్దరు తోటి విద్యార్థులు జ్యూస్‌లో కలిపిన మూత్రాన్ని తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో జరిగింది. లా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌కు మూత్రంలో జ్యూస్ కలిపి తాగించారు. ఈ కారణంగా యూనివర్సిటీ యాజమన్యం ఆ ఇద్దరు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది.
పౌరసరఫరాల సంస్థలో శాశ్వత ప్రతిపాదికలో పనిచేసే ఉద్యోగుల గ్రూప్ మెడికల్ క్లెయిమ్ రూ.3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం జరిగిందని పౌరసరఫరాల శాఖకమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. మెడికల్ క్లెయిమ్ ధరలను నిర్ణయించడానికి జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్మెంట్), జనరల్ మేనేజర్ (మార్కెటింగ్), జనరల్ మేనేజర్ (ఫైనాన్స్), డిప్యూటి జనరల్ మేనేజర్ (అడ్మిన్)తో ఒక కమిటీని వేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థల నుంచి సీల్డ్ కొటేషన్స్‌ను ఆహ్వానించడం జరిగింది. మంగళవారం నాడు పౌరసరఫరాల భవన్లో…
అయోధ్యలో ఎన్నో శతాబ్దాల పోరాటం.. నిరీక్షణ తర్వాత రామ్ లల్లా విగ్రహం సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ప్రతిష్టించబడింది. కాగా.. అంతకుముందు రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసే పనిని ముగ్గురు శిల్పులకు అప్పగించింది ఆలయ ట్రస్ట్. అయితే రామమందిరంలో ప్రతిష్టబోయే ముందు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. చివరకు మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అయితే ఎంపిక కానటువంటి రాంలల్లా విగ్రహం ఆలయంలో ప్రతిష్టించలేకపోయినప్పటికీ, ఆలయ…
సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన బీసీ సంక్షేమ శాఖపై బడ్జెట్ సన్నాహక సమీక్షా సమావేశం జరిగింది.. సమీక్షా సమావేశానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రెటరీ హరిత, బీసీ వెల్ఫెర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హాజరయ్యారు.. గతంలో బీసీ సంక్షేమానికి కేటాయించిన నిధులు ప్రస్తుతం బడ్జెట్ లో కటాయించాల్సిన అంశాల పై చర్చ జరిగింది. ప్రధానంగా బీసీ రెసిడెన్షియల్…
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. అయితే ఆ పడవలో మొత్తం ఏడుగురు మహిళలు ప్రయాణిస్తున్నారు. అందులో ఒకరిని రక్షించారు. మరొకరు మృతి చెందగా, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ చేసిన కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేసామని తెలిపారు తెలంగాణ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ షిక గోయల్. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. తమిళనాడు స్టేట్ చెందిన మెయిన్ ఏజెంట్ ద్వారా నకిలీ పాస్ పోర్ట్ రాకెట్ గుర్తించామన్నారు. ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్న వారిని ఎవరిని వదిలిపెట్టామని ఆయన వెల్లడించారు. తమిళనాడు ఏజెంట్ నకిలీ పత్రలు సృష్టించి హైదరాబాద్ కి పంపారని ఆయన పేర్కొన్నారు.…
ఎన్నో ఏళ్ల కల అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమైంది. సోమవారం ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా ప్రాణప్రతిష్ట చేశారు. కాగా.. ఈ మహోత్సవాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వేయి కళ్లతో ఎదురుచూశారు. అంతేకాకుండా.. ప్రాణప్రతిష్ట జరగగానే రామభక్తులు సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు 'జై శ్రీరామ్.. జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికులతో పాటు చైనా సైనికులు కూడా జైశ్రీరామ్ అంటూ నినాదాలు…
లోక్‌సభ సెగ్మెంట్ల సన్నాహక సమావేశాల తర్వాత, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషించేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహించనుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే పరాజయం పాలైనట్లు పార్టీ భావించింది. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు మాట్లాడుతూ.. జనవరి 3న ఆదిలాబాద్‌తో ప్రారంభమైన సమావేశాలు సోమవారం నల్గొండ…