Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనుంది. నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఏప్రిల్ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మ.3గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. రేపు ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
Read Also: YSR Aasara Scheme: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. నేడు అకౌంట్లలోకి డబ్బులు
ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలలోని 09 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67,568 మంది భక్తులు దర్శించుకున్నారు. 22084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.58 కోట్లు వచ్చింది.