ఈరోజు అయోధ్యలో జరిగిన రామ్ లల్లా ప్రాణప్రతిష్ట మహోత్సవానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఆయన అయోధ్యలోని రామమందిర ట్రస్ట్‌కు రూ.2.51 కోట్లు విరాళంగా అందజేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి రూ. 2.51 కోట్లు విరాళంగా ఇచ్చారని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖేష్ అంబానీ తన భార్య నీతా, కుమార్తె ఇషా,…
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ యాత్రను అస్సాం లో బీజేపీ నాయకులు(గుండాలు ) అడ్డుకొని దాడి కి ప్రయత్నించడం దారుణమన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ యాత్ర పై బీజేపీ గుండాల దాడిని ఖండిస్తున్నానన్నారు. రాహుల్ గాంధీ గారు దేశంలో జరుగుతున్న పరిణామల పై న్యాయం జరుగలని అలాగే న్యాయ యాత్ర చేస్తున్నారని, అలాగే దేశంలో ద్వేషాలు కాదు ప్రేమ పెంపొందించాలని యాత్ర చేస్తుంటే బీజేపీ నాయకులు…
సోమవారం అయోధ్యలోని రామ మందిరం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోట్లాది మంది రామభక్తులకు మరపురాని రోజని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ క్షణం కోసం ఎన్నో తరాలు ఎదురుచూశాయని, అయితే రామజన్మభూమిలో మళ్లీ ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని, నమ్మకాన్ని ఏవీ వమ్ము చేయలేదని షా అన్నారు. మరోవైపు.. రామమందిరం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ నివాళులు అర్పించారని తెలిపారు. వారు ఎన్నో అవమానాలు, చిత్రహింసలు ఎదుర్కొన్నారని అయితే మత మార్గాన్ని వీడలేదని షా…
ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ కోసం కొత్త రూట్లు ఖరారయ్యాయి. మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇటీవల అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సోమవారం తన ముందు ఉంచిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ రూట్లు నగర జనాభాలో పెద్ద వర్గానికి అందడం లేదని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. దీని…
ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై మరోసారి వైసీపీ, టీడీపీ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. కొత్త ఆరోపణలను రెండు పార్టీలు తెరపైకి తెచ్చాయి. వైసీపీలో మారిన ఇన్ఛార్జ్లు తమ అనుచరులను కొత్త నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేరుస్తున్నారని టీడీపీ ఆరోపించింది. జనసేనకు ఇచ్చే సీట్లలోని టీడీపీ ఓటర్లను వేరే నియోజకవర్గాలకు మారుస్తున్నారని వైసీపీ ఆరోపించింది.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ తెలంగాణ చౌరస్తా కాషాయమయంగా మారింది. తెలంగాణ చౌక్ లో సంబురాలు అంబురాన్నంటాయి. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ నేపథ్యంలో టపాసులు పేల్చి సంబురాలు చేసుకుంటున్నారు వివిధ హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు. తెలంగాణ చౌక్ వద్ద ఆనందోత్సవాల మధ్య హిందూ సంఘాల కార్యకర్తలతో కలిసి స్వయంగా బండి సంజయ్…
రామనగరి అయోధ్య నుంచి తిరిగివచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం కోటి ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. కాగా.. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లు తగ్గుతుందని ప్రధాని మోదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. దీనితో పాటు ఇంధన…
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు భారత్ జొడో న్యాయ యాత్ర చేస్తున్న సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన తో బెంబేలెత్తిపోయిన బీజేపీ గుండాలు అస్సాం లోని సోనిత్ పూర్ జిల్లాలో దాడికి పాల్పడ్డారు. బీజేపీ కార్యకర్తలు గుండాలు చేసిన దాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీ పైన జరిగిన దాడి ప్రజాస్వామ్యంపైన జరిగిన దాడి, ఈ దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద…
2023 ఏడాదికి సంబంధించి అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ఈరోజు ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా.. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు చోటు కల్పించింది. సూర్యకుమార్ తో మొత్తం నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.
అయోధ్యలో సరయూ నది తీరాన దీపోత్సవం కన్నులపండగగా సాగింది. సరయూ నది తీరాన భక్తులు 14 లక్షల దీపాలు వెలిగించారు. దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలతో దీపాలంకరణ చేశారు. అటు.. జనక్‌పూర్ ధామ్‌లోని జానకి ఆలయంలో కూడా దీపోత్సవం నిర్వహించారు. ఆ సమయంలోనే.. అయోధ్యలోని హనుమాన్‌గర్హి ఆలయంలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.