దక్షిణ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడితో అతని ముగ్గురు స్నేహితులు బలవంతంగా బూట్లు నాకించి అనంతరం అతడితో "అసహజ సెక్స్" చేయించారు. నిందితులు తమ మొబైల్ ఫోన్లలో ఈ చర్యను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నారు. ఈ మేరకు సోమవారం పోలీసులు సమాచారం అందించారు.
ప్రభుత్వ అధికారిణి అయిన భార్యను భర్త హత్య చేశాడు. మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలోని షాపురాలో పోస్ట్ చేయబడిన మహిళా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM)ని సర్వీస్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రికార్డులలో నామినీగా చేయనందుకు ఆమె భర్త ఆమెను హత్య చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి సోమవారం తెలిపారు.
మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అన్ని గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలు, రిటైల్ మాంసం, గొడ్డు మాంసం దుకాణాలను జనవరి 30న మూసివేయనున్నారు. ఈ క్రమంలో, ఉత్తర్వులను అమలు చేయడంలో మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సహకారం అందించడానికి సంబంధిత అధికారులను ఆదేశించాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ GHMC పరిధిలోకి వచ్చే మూడు పోలీసు కమిషనరేట్లను అభ్యర్థించారు. ఇదిలా ఉంటే.. జీఓ ఎంఎస్ నెం 59 ప్రకారం ప్రభుత్వ భూముల…
బీహార్‌లో నితీష్‌కుమార్ సారథ్యంలో బీజేపీ-జేడీయూ కూటమి ఆదివారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్, ఆర్జేడీ, లెప్ట్‌పార్టీల కూటమి నుంచి బయటకు వచ్చి కమలం పార్టీతో మద్దతు మరోసారి నితీష్‌కుమార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా నితీష్ తీరుపై ఇండియా కూటమిలోని పలు పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఆయన తీరును తీవ్రంగా ఖండించాయి.
పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి అమ్ముకున్నారనే ఆరోపణలపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. పదేళ్ళుగా ఎక్కడైనా తప్పు చేశాను అనో.. ఒకరి దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నానో నిరూపించగలరా అని ప్రశ్నించారు. కాగా.. జగన్ మీదా ఆయన సొంత చెల్లిలే విమర్శలు చేసినప్పుడు.. తనమీద ఎందుకు చేయరని పేర్కొన్నారు. కౌన్సిలర్ భువనేశ్వరికి పదవీ ఇస్తే అమ్ముడుపోయి.. తనపైనే విమర్శిస్తున్నారని మంత్రి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు చాలా బాగుతున్నాయని, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలన్నది మంచి ఆలోచన అని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబునిచ్చారు. సోమవారం నాడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వీ హబ్ లో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, బెంగళూరు కాన్సూలేట్ జనరల్ హిలరి మెక్ గెచ్చి రాష్ల్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన…
5వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసిద్ధ దేశభక్తి గీతం 'దేశ్ రంగీలా'ను పాడినందుకు ఈజిప్టు అమ్మాయి కరీమాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రశంసించారు. ఇండియా హౌస్‌లో జరిగిన వేడుకలో కరీమాన్ ఈ పాటను అందించారు. ఆమె ప్రదర్శనకు భారతీయులు, ఈజిప్షియన్ల నుంచి ప్రశంసలు లభించాయి.
ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(SIMI)పై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. హోం మంత్రిత్వ శాఖ ఈ రోజు (జనవరి 29) ఈ సంస్థను కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం దానిపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు 'చట్టవిరుద్ధమైన సంఘం'గా ప్రకటించింది.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకుంది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ అధికారులు చేరుకోగా.. ఆయన తన ఇంట్లో లేరని, ఎక్కడికో వెళ్లారని ఈడీ వర్గాలు వెల్లడించాయి.