ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మంగళవారం నాడు 60 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు ఓ బస్సు డ్రైవర్. ఆ వ్యక్తి బస్సును నడుపుతున్నప్పుడు అతనికి గుండెపోటు రాగా.. ఆ నొప్పితో కూడా బస్సును ఆపి బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీ ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని…
గత కొన్ని రోజుల నుండి అనగా ఈ నెల 25వ తేది నుండి గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాని తెలంగాణ శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పత్రికా ప్రకటనను సోమవారం విడుదల చేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఆ రోజు నుండి ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా చికిత్సపొందుతున్నానని ఆయన పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉండటం కారణంగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 వ తేదీ సాయంత్రం గవర్నర్ గారి “AT HOME” కార్యక్రమానికి కూడా వెళ్ళలేదని…
భారత్, సౌదీ అరేబియాల సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి తమ తొలి సంయుక్త విన్యాసాలను ప్రారంభించినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలే దేశానికి చివరి ఎన్నికలంటూ ఖర్గే హాట్ కామెంట్స్ చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇకపై ఎన్నికలు జరగవని అన్నారు. కాబట్టి ప్రజలు వచ్చే ఎన్నికల్లో అప్రమత్తమై ఓటేయాలని కోరారు. మోడీ గనుక మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని…
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎవరు అధైర్య పడవద్దు….119 సీట్లలో 39 సీట్లు గెలిచినం…బలమైన ప్రతిపక్షంగా ఉన్నామన్నారు. 14 సీట్లు ఐదు వేల ఓట్లతో ఓటమి పాలైనం…అందులో సగం గెలిచినా హంగ్ వచ్చేదని, 14 ఏళ్ళు అభివృద్ధి బాటలో కారు వంద కిలోమీటర్ల స్పీడ్ తో పోయిందన్నారు కేటీఆర్. కారు సర్వీసింగ్ కు పోయింది… మళ్లీ వంద స్పీడుతో దూసుకొస్తదని,…
వీసాల జారీలో కొర్రీలు పెట్టే అగ్రరాజ్యం.. ఈసారి మాత్రం భారతీయులకు వీసాలు వచ్చే విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది ఏకంగా రికార్డు స్థాయిలో భారతీయులకు వీసాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లంచ్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. శాసనసభ సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మండలి ఛైర్మన్ జారీ చేసిన నోటీసులను ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. వీటిపై సోమవారం వాదనలు…
ఎన్నికల ముందు కేంద్రం తాయిలాలు ప్రకటించబోతుందా? మూడోసారి ముచ్చటగా అధికారం చేపట్టేందుకు మోడీ సర్కార్ ప్రణాళికలు వేసిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వచ్చే గురువారం (ఫిబ్రవరి 1న) కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రెండు నెలల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నదాతలకు, ప్రజలకు తాయిలాలు ప్రకటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్ వంటి పథకాల్లో కీలక మార్పులు ఉండే అవకాశం…