టీడీపీతో టచ్‌లోకి మరో వైసీపీ ఎమ్మెల్యే..! రేపో మాపో సైకిల్ ఎక్కే అవకాశం..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే.. తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారట.. తిరుపతి జిల్లా సత్యవేడు (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన అధికార వైసీపీకి చెందిన శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం.. ఈ మధ్యే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు.. మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి దళితులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, వారికి ఇష్టానుసారంగా షరతులు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సిద్ధమయ్యారనే చర్చ సాగుతోంది.. మరో రెండు, మూడు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని అనుచరులు చెబుతున్నమాట..
మెట్రో ట్రైన్ లో పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రయాణికులు
లండన్ అండర్‌గ్రౌండ్ రైలులో ప్రయాణికులు కొట్టుకున్న వీడియో తెగ వైరల్ అవుతుంది. ఓ గ్యాంగ్ మరో గ్యాంగ్‌పై దాడులు చేస్తున్నట్ల మనం చూడొచ్చు.. ఓ వ్యక్తిని పట్టుకుని మరో ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఇష్టం వచ్చినట్లుగా అతన్ని కొట్టడంతో పాటు మెట్రో ట్రైన్ డోర్ దగ్గరకు లాగి మరీ కుస్తీ పట్టారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగినట్లు తెలుస్తుంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఇద్దరు వ్యక్తులు ఒకర్ని కొడుతుండగా మరో వ్యక్తి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఇంతకీ ఎందుకు ఈ గొడవ జరిగిందో ఇప్పటి వరకు తెలియలేదు.
అయితే, రెండు గ్యాంగ్‌లు కొట్టుకుండగా అక్కడ ఉన్న ప్యాసింజర్లు అరుపులు, కేకలు వేశారు. ఈ దాడి ఆపాలని కోరారు. కానీ వాళ్లు మాత్రం వినకుండా అలాగే ఫైట్ చేశారు. లండన్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగి ఒకరు ఆ కొట్లాటను ఆపే ప్రయత్నం చేశాడు.. కానీ వారు మాత్రం ఆగలేదు.. దీంతో ఈ ఘటన గురించి బ్రిటీష్ ట్రాన్స్‌పోర్టు పోలీసులు ఓ ట్వీట్ చేశారు. దర్యాప్తు జరుగుతుంది.. సమాచారం తెలిస్తే తమకు చెప్పాలని ఆ ట్వీట్‌లో వారు కోరారు.
నిజం అంటే జగన్.. ఇది ప్రజల నమ్మకం..
నిజం అంటే వైఎస్ జగన్.. ఇది ప్రజల నమ్మకం అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి.. ‘సత్యమేవ జయతే అని బాపూజీ అంటే.. అసత్యమేవ జయతే అంటాడు చంద్రబాబు’ అంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు ప్రజలు నమ్మలేదు… పవన్ కల్యాణ్, లోకేష్ నమ్ముకున్నాడని ఎద్దేవా చేశారు. నిజం అంటే జగన్.. ఇది ప్రజల నమ్మకంగా అభివర్ణించారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయటం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు మార్పు గేమ్ ఆడితే చంద్రబాబు కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పేదవాడికి సహాయం చేస్తున్న వాడిని ఓడించండి అనడం విడ్డూరం అని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ ను ఓడించడానికి పార్టీ పెట్టానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను రాజకీయ కోవిధులు ఆలోచన చేయాలని సూచించారు. చంద్రబాబు అంటే అబద్ధం.. జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని వ్యాఖ్యానించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.
రంగంలోకి ప్రభాస్… పరమశివుడు ఆగమనానికి సర్వం సిద్ధం
గతంలో ఓసారి హిందీ సినిమాలో క్యామియో ఇచ్చాడు ప్రభాస్. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన సినిమా సమయంలో సాంగ్ లో జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోయిన అప్పటి ప్రభాస్ కి పాన్ ఇండియా బాక్సాఫీస్ కి సోలో కింగ్ గా నిలిచిన ఇప్పటి ప్రభాస్ కి చాలా తేడా ఉంది. బాహుబలి పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ గా మారిన ప్రభాస్ కి… నార్త్‌లో ప్రభాస్ గుడికట్టే రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఏకంగా ఖాన్ త్రయాన్ని సైతం వెనక్కి నెట్టి… బాలీవుడ్ హీరోలకు వణుకు పుట్టిస్తున్నాడు ప్రభాస్. రెబల్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే చాలు… ఎంత పెద్ద హీరో అయిన సరే వెనకడుగు వేయాల్సిందేనని.. రీసెంట్‌గా సలార్ వర్సెస్ డంకీ వార్ ప్రూవ్ చేసింది. అలాంటి ప్రభాస్ క్యామియే చేస్తున్నాడు అంటే, ఆ సినిమా పై హైప్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మంచు విష్ణు భారీ బడ్జెట్‌తో కన్నప్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్‌దేవ్ బొమ్మ..
యోగా గురు రామ్ దేవ్ బాబా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అందరికీ ఈయన గురించి తెలుసు.. యోగా మాత్రమే కాదు పలు బిజినెస్ లు కూడా చేస్తుంటారు.. కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తూ వార్తల్లో కూడా నిలుస్తుంటారు.. ఇప్పుడు మరో న్యూస్ వార్తల్లో హైలెట్ అవుతుంది.. న్యూయార్క్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈయన మైనపు బొమ్మను పెట్టినట్లు తెలుస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
చాలా మంది ఇక్కడ బొమ్మలు ఉంటే ఏదో సాధించిన ఫీలింగ్ లో ఉంటారు.. ఇప్పటికే అక్కడ ఎంతోమంది ప్రముఖుల మైనపు బొమ్మలు ఉన్నాయి.. మహాత్మగాంధీ నుంచి మొదలుపెట్టి ఇందిర, మన్మోహన్‌సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ సహా కొందరు రాజకీయ నాయకీయ నాయకులకు దక్కింది.. అలాగే స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్,టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, ప్రభాస్ లతోపాటు మరికొందరి మైనపు బొమ్మలు కూడా అక్కడ ఉన్నాయి.. ఇప్పుడు రామ్ దేవ్ బాబాకు ఆ గౌరవం దక్కింది..
ఒంగోలుపై పట్టు సాధించేందుకు టీడీపీ కసరత్తు..
ఒంగోలు తెలుగుదేశానికి ఎంతకీ కొరుకుడుపడని కొయ్యగా తయారైంది. ఆ జిల్లాలో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్లమెంట్ సీటుతో పాటు, మరో అసెంబ్లీ సెగ్మెంట్ కు కూడా ఇంచార్జ్ దొరకడం లేదు. అభ్యర్థుల కసరత్తు, రాజకీయ వ్యూహాలు ఎన్ని ఉన్నా.. ఆ పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదని టాక్.. చివరినిమిషంలో సీటు దక్కగా వచ్చే వలస నేతల కోసమే ఆ పార్టీ ఎదురుచూస్తోందని అధికార పార్టీ విమర్శిస్తోంది.
ఒంగోలు ఎంపీ స్థానాన్ని టీడీపీ ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఆ సీటుపై వైసీపీ జెండా పాతింది. అలాంటి చోట టీడీపీ గెలుపుపై ఆపసోపాలు పడుతుంది. 2014లో టీడీపీ నుంచి పోటీచేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఓడిపోయారు. దాంతో ఆయన ఎమ్మెల్సీగా కొన్నాళ్లు కొనసాగారు. ఆ తర్వాత ఎన్నికల సమయానికి మాగుంట వైసీపీలో చేరారు. దాంతో సిద్ధారాఘవ రావు బరిలో నిలబడాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో సిద్ధా ఓడిపోయారు. అంతటితో ఎపిసోడ్ అయిపోలేదు. కొంతకాలం తర్వాత సిద్ధా కూడా వైసీపీ గూటికి చేరారు.
ఫేక్ పోస్టింగులతో తలపట్టుకుంటున్న టీడీపీ..
ఫేక్ పోస్టింగులతో టీడీపీ తలపట్టుకుంటుంది. టీడీపీని.. ఆ పార్టీ నేతలను టార్గెట్ చేసుకుంటూ ఫేక్ పోస్టింగులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ పెంచేలా పోస్టింగులు ఉండడంతో టీడీపీ ఆందోళన చెందుతుంది. జనసేనకు 63 స్థానాలు ఇచ్చామంటూ ఇటీవలే అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్ పోస్టింగులు చేశారు. అంతేకాకుండా.. పవన్ ను విమర్శిస్తున్నట్టు బుద్దా వెంకన్న పేరుతో ఫేక్ పోస్టింగులు పెట్టారు. కాగా.. కేశినేని నానినే తనపై ఫేక్ పోస్టింగులు పెట్టారని బుద్దా భావిస్తున్నారు. ఈ క్రమంలో బుద్ధా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుజ్జీలు, నానీలు తననేం పీకలేరంటూ విమర్శలు గుప్పించారు. అచ్చెన్న, బుద్దాల పేర్లతో వచ్చిన ఫేక్ పోస్టింగులపై పోలీస్ స్టేషన్లల్లో టీడీపీ ఫిర్యాదులు చేసింది.
ఖమ్మంలో పట్టు బడ్డ గంజాయి చాక్లెట్స్
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాపితంగా గంజాయి రవాణా కాకుండా తగిన చర్యలను తీసుకుంటున్నామని ఎక్పైజ్ శాఖ డిప్యూటీ కమీసనర్ జనార్ధన్ రెడ్డి చెబుతున్నారు. గత రాత్రి ఓడిస్సా , ఎపి రాష్ర్టాల మీదుగా గంజాయి చాక్లెట్స్ హైదరాబాద్ కు తరలుతున్న వాటిని ఎక్పైజ్ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. ఇలా ఖమ్మంలో గంజా చాక్లెట్స్ పట్టుకోవడం ఇదే ప్రదమం.. హైదరాబాద్ లో చాక్లెట్లను ఒక్క చోట అప్పగించవలసిన ఉన్నదని నిందితులు చెప్పారని అంటున్నారు. దీని మీద ఇంకా లోతుగా విచారణ జరుగుతుందని అంటున్నారు. గత యేడాది మొత్తం గంజాయిని ఉమ్మడి జిల్లా వ్యాపితంగా 3600 కిలోలను పట్టుకున్న ఎక్పైజ్ శాఖ ఈ యేడాది జనవరి నుంచి నెల రోజుల్లోనే ఏడు వందల కిలోల గంజాయిని పట్టుకున్నామని మరింతగా తనిఖీలు ముమ్మరం చేస్తామని అంటున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్పైజ్ శాఖ డిప్యూటీ కమీషనర్ జనార్ధన్ రెడ్డి.
నితీష్-అజిత్ పవార్ రాకతో ఎన్డీయేకు పెరగనున్న సీట్లు
గతేడాది జూలై నెలలో మహారాష్ట్రలో రాజకీయంగా పెను దుమారం చెలరేగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) సీనియర్ నేత అజిత్ పవార్ ఎమ్మెల్యేల బృందంతో కలిసి మహారాష్ట్రలో అధికార కూటమిలో చేరారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ కూడా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర తర్వాత ఇప్పుడు బీహార్‌లోనూ పెను దుమారం రేగింది. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రచారం నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసిన నితీశ్ కుమార్ ఇప్పుడు ఎన్డీయేలో చేరారు.
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యే ఛాన్స్.. నెక్ట్స్ సీఎం ఎవరంటే..!
గత వారంలో నెలకొన్న బీహార్ సంక్షోభం ఆదివారంతో ఫుల్ స్టాప్ పడగా.. ఇప్పుడు ఝార్ఖండ్ వంతు వచ్చింది. తాజాగా ఝార్ఖండ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ హాట్‌గా సాగుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మిస్సింగ్ అయ్యారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. వారం రోజుల క్రితం ఆయన ఢిల్లీలోని అధికార నివాసానికి వచ్చిన తర్వాత హేమంత్ కనిపించకుండపోయారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోమవారం ఢిల్లీలోని సీఎం నివాసానికి ఈడీ అధికారులు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి అందుబాటులో లేరు. దీంతో ఓ బీఎండబ్ల్యూ కారు, బ్యాగ్ సీజ్ చేసి అధికారులు వెళ్లిపోయారు. ఈ పరిణామంతో హేమంత్ సోరెన్ మిస్సింగ్ అంటూ మీడియాలో బర్నింగ్ టాఫిక్‌గా మారింది.
ఆరవ తరగతి విద్యార్థి పై 13 మంది తోటి విద్యార్థులు దాడి
ఒక చిన్న వివాదం చిలికిచిలి కి గాలి వానగా మారింది. విద్యార్థులు కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. తమను బెదిరించారని ఒక జట్టు గట్టిన 13 మంది విద్యార్థులు తోటి విద్యార్థిని చితకబాదిన ఘటన ఇది. వీరంతా చదువుతున్నది కేవలం ఆరవ తరగతి మాత్రమే. ఆరవ తరగతిలోనే కక్షలు కార్పన్యాలతో ప్రతీకారం తీర్చుకునే స్థాయికి వెళ్లిన ఘటన ఇది. ఇది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లలోని tswrjc హాస్టల్లో ఈ ఘటన జరిగింది. ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి సాల్వం రాజును అదే తరగతికి చెందిన 13 మంది విద్యార్థులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
గతంలో ఒక చిన్న వివాదంలో సాల్వం రాజు విద్యార్థులని బెదిరించడం జరిగింది. అప్పటినుంచి కక్ష పెట్టుకున్న మిగతా విద్యార్థులు అవకాశం కోసం ఎదురుచూసి మూడు రోజుల క్రితం హాస్టల్ రూమ్ లో రాజు పై దాడి చేశారు. చుట్టూ తలుపులు వేసి కర్రలతో తీవ్రంగా కొట్టారు ఈ దాడిలో రాజు చేయి విరిగింది. ఒళ్లంతా కమిలిపోయింది అయితే ఆలస్యంగా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు బియ్యం బంజర పోలీసుల్ని ఆశ్రయించారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరితోనూ ప్రమాణం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఇటీవల కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడాన్ని బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. ఎమ్మెల్సీలుగా తమ పేర్లను తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడాన్ని బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు సవాల్ చేశారు. మంత్రి మండలి తీర్మానం చేసి పంపిన పేర్లను గవర్నర్ తిరస్కరించారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసారథి పై ట్రోలింగ్..
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసారథి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. నూజివీడు సీటు సారథికి వద్దు, గాడిదను అయినా గెలిపిస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కలకలం రేపుతోంది. సారథి వస్తే తరిమి కొడతాం అంటూ పోస్టింగ్ లు వెలిశాయి. ఇప్పటికే టీడీపీ నూజివీడు సీటు తనకు కన్ఫర్మ్ అయిందని.. స్థానిక టీడీపీ నేతలకు సారథి ఫోన్స్ చేయటంతో రచ్చ జరుగుతోంది. తాజాగా పోస్టింగ్ లతో సారథి వ్యవహారం రచ్చగా మారింది.
ఆ పోస్ట్ లలో పెనమలూరులో పోటీ చేస్తే ఓడిపోతావ్ వైసీపీ టికెట్ ఇవ్వలేను- పార్ధుతో జగన్ అన్న… పెనమలూరులో పోటీ చేస్తే ఓడిపోతావ్ టీడీపీ టికెట్ ఇవ్వలేను- పార్ధుతో చంద్రబాబు.. పెనమలూరులో ఏ పార్టీకి పనికిరాని పార్ధు,, పెనమలూరులో ఏ పార్టీ టికెట్ తెచ్చుకోలేని పార్ధు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు.
కేటీఆర్ అసమర్థత వల్లనే తొమ్మిదవ ప్యాకేజీ పనులు నిలిచి పోయాయి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో జెడ్పీటీసీ, మాజీ జడ్పీటిసి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సహా సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంత మంత్రి నియోజకవర్గానికి వస్తే ముందస్తు అరెస్ట్ ల పేరిట నిర్బంధించారు, కాని మా ప్రభుత్వం స్వేచ్ఛ గా సమస్యలు విన్నవించుకునే అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు. కేటీఆర్ ను అడ్డుకున్నారని పెట్టిన కేసులను ప్రభుత్వంతో మాట్లాడి, తొలగింప చేస్తామని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ అసమర్థత వల్లనే తొమ్మిదవ ప్యాకేజీ పనులు నిలిచి పోయాయని ఆయన మండిపడ్డారు.
కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు
కాంగ్రెస్ మైనార్టీలకు టికెట్ ఇచ్చింది .. కానీ ఓడిపోయామన్నారు షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి ఇవ్వలేదని, ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారన్నారు. టీఎస్‌పీఎస్సీలో.. మెంబర్ ఇచ్చామన్నారు షబ్బీఆర్ అలీ. హైకోర్టు జీపీ వస్తున్నారని, కాంగ్రెస్ ఏ పోస్టింగ్ ఇచ్చినా మైనార్టీ కోటా ఉంటుందన్నారు. కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు అంటూ షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఏం పదవులు ఇచ్చిందని, ఆకాశం మీద ఉమ్మితే మొఖం మీద పడతదని ఆయన విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు కేటీఆర్ అంటూ ఆయన మండిపడ్డారు.