Shabbir Ali : కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ మైనార్టీలకు టికెట్ ఇచ్చింది .. కానీ ఓడిపోయామన్నారు షబ్బీర్ అలీ ప్రభుత్వ సలహాదారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి ఇవ్వలేదని, ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారన్నారు. టీఎస్‌పీఎస్సీలో.. మెంబర్ ఇచ్చామన్నారు షబ్బీఆర్ అలీ. హైకోర్టు జీపీ వస్తున్నారని, కాంగ్రెస్ ఏ పోస్టింగ్ ఇచ్చినా మైనార్టీ కోటా ఉంటుందన్నారు. కేటీఆర్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు అంటూ షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఏం పదవులు ఇచ్చిందని, ఆకాశం మీద ఉమ్మితే మొఖం మీద పడతదని ఆయన విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు కేటీఆర్ అంటూ ఆయన మండిపడ్డారు.
మీ అయ్యా కామారెడ్డి ఎందుకు వచ్చాడు.. నన్ను ఒడిద్దాం అనుకున్నాడు.. మీ అయ్యా ఓడిపోయాడు.. దేవుడు చూస్తాడు కదా .. కామారెడ్డి లో మీ అయ్యా ఎందుకు పోటీ చేశాడు అనే దానికి సమాధానం చెప్పు.. తర్వాత మాట్లాడు.. మహమూద్ ఆలీ ఎమ్మెల్సీ చేసింది కాంగ్రెస్.. కేటీఆర్ పిచ్చోడు.. వాడికి తెలియదు. మా మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యాడు.. మా భిక్ష వాళ్లకు ఎమ్మెల్సీ ఇవ్వడమని షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్‌లో చాలా మంది డబ్బుల కోసమే బతుకుతారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ రేవంత్ కాలి గోటికి కూడా సరిపోరు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనిపించదు అని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏ కారణం వల్ల ఓడిపోయారో చెప్పే దమ్ము, ధైర్యం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉందా? అని ప్రశ్నించారు.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!