రేపు(మంగళవారం) ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమీక్ష చేపట్టనున్నారు. ఉదయం 11:30 కు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేపటి సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది.
టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొద్ది మంది సోషల్ మీడియా వీరులు కరెంటు సరఫరా పైన తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు తో పాటు ఎటువంటి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్న బిఆర్ఎస్ సోషల్ మీడియా వీరుల ఆశలను, అసలు స్వరూపాన్నిప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వమని,…
అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. నిరాశ్రయుడి ఆశ్రయం ఇచ్చి ఓ వ్యక్తిపై జాలి చూపిన భారత్కు చెందిన విద్యార్థి యూఎస్లో తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.
Ayodhya: గత వారం ఎంతో ఘనంగా అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. దేశ నలుమూలల నుంచి వచ్చేసిన అతిరథమహారధుల మధ్య అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇప్పుడు లక్షలాది మంది ప్రతిరోజు అయోధ్యను సందర్శిస్తున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో రకరకాల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పడ్డాయి. అలాగే అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కూడా మరికొన్ని ఏర్పడ్డాయి. అయితే ఓ రెస్టారెంట్ నిర్వాహకుడి చేసిన కక్కుర్తిపని వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.…
ఏపీలో సైకో పాలన కొనసాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. రాజమండ్రిలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిలో ఆడపిల్లకు సమాన వాట ఇవ్వాలని ఎన్టీఆర్ పని చేస్తే, చట్టాలు చేస్తే.. ఈ రోజు వైఎస్ బిడ్డకు సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి సీఏం జగన్ ది అని దుయ్యబట్టారు. ఆడపిల్లల పై దాడులు చేస్తున్న ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్నా.. ఆడబిడ్డల…
మా ఫొటోలకు బాక్సింగ్ బ్యాగులు పెట్టి తన్నారు.. ఇది న్యాయమేనా..? విశాఖలో వైసీపీ ‘సిద్ధం’ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. కాగా.. సభకు హాజరైన సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సంబంధించిన ఫొటోలు పెట్టి కొందరు కార్యకర్తలు ఆ ఫొటోలపై బాక్సింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి కొట్టారు. కాగా.. ఆ వీడియోపై స్పందించిన…
భోపాల్లో నివసిస్తున్న హబీబ్ నాజర్ అలియాస్ మంఝాలే మియాన్ను మధ్యప్రదేశ్లోని పెద్ద వరుడు అని పిలుస్తారు. దీనికి కారణం 103 ఏళ్ల వయసులో వృద్ధుడు హబీబ్ 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్ను పెళ్లి చేసుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు హబీబ్ ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఈ వయసులో మూడోసారి పెళ్లి చేసుకున్నాడు.
సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టాలన్నారు. వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే విపక్షాలన్నీ ఏకధాటిపైకి రావాలనుకున్నాయి. అంతే తడువుగా ఆయా రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పాడ్డాయి. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో సమావేశాలు పెట్టి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించుకున్నాయి. సీట్లు సర్దుబాటు.. క్యాంపెయిన్, తదితర అంశాలపై బాగానే మేథోమదనం చేశాయి. ప్రజల్లో ఒక విధమైన సానుకూల పవనాలు కూడా వీచాయి. ఇంతలో కూటమి తీసుకున్న ఓ నిర్ణయం ఒక్క కుదుపు కుదిపి మూడు…
కోమటిరెడ్డి, ఆయన అనుచరులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాని ఆయన తెలిపారు. మంత్రి అయిన తర్వాత బుద్ధి మారుతుంది అనుకుంటే ఇంకా హీనంగా ఉందని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. మాధవరెడ్డి పేరు చెప్పుకుని, ఆయన అనుచరులకు సిగరెట్లు మోసి బతికిన చరిత్ర వెంకట్ రెడ్డి ది అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ నుండి తొలగిస్తాడనే దొంగ దీక్ష అని, రేవంత్ బెడ్ రూమ్ లోకి పోయి కాళ్లు పట్టుకుంటేనే వెంకట్ రెడ్డికి…
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయనికి పలువురు ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఐదవ జాబితా కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు క్యూ కట్టారు. సీఎంఓకు వచ్చిన వారిలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్, సుచరిత, అన్నాబత్తుని శివ కుమార్, రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామి రెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మంత్రి జోగి రమేష్…