CM Revanth Reddy : అభ్యర్థుల ఎంపిక కోసం సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక కోసం సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఈసీ సమావేశంలో అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా… తెలంగాణ ప్రజల హక్కులపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పిందని, కానీ.. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంపైనే బీజేపీ దృష్టిపెట్టిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఇచ్చిన ఏ ఒక్క మాటను కూడా మోడీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక నిర్ణయం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించామన్నారు.
అంతేకాకుండా.. ‘వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వాళ్ళు.. ఫిబ్రవరి3 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ 25 వేలు, జనరల్, బీసీ లకు 50 వేలు చెల్లించాలి. ఫిబ్రవరి 15 నుండి 20 వరకు అభ్యర్ఫుల ఎంపిక ప్రక్రియ. ప్రతి పార్లమెంట్ కి మంత్రిని.. సీనియర్ నేతల ఇంఛార్జి గా పెట్టాము. విభజన హామీలు కేసీఆర్ అడగలేదు.. మోడీ ఇవ్వలేదు. జాతీయ ప్రాజెక్టులు రాలేదు.. Itir లేదు.. తెలంగాణ ప్రజల హక్కులపై కేంద్రం నిర్లక్ష్యం వహించింది. రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు..కానీ అప్పుల్లో కూరుకు పోయారు రైతులు. కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యం ని విచ్ఛిన్నం చేసే పనిలో మోడీ ఉన్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోడీ 100 కోట్ల అప్పు చేశారు. మూడో సారి విద్వేషం రెచ్చగొట్టి అధికారం లోకి రావాలని చూస్తున్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్రంలో సచ్చింది.. ప్రజలు బొంద పెట్టారు. బావ బామ్మర్ది ఉనికి కోసం పాటుపడుతున్నారు.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
బిళ్ళా రంగ మాటలు చూడండి. కాంగ్రెస్ ఉండటం మంచిది కాదన్నట్టు మాట్లాడుతున్నారు. బావ బామ్మర్దిల మాటలు మోడీ ని గెలిపించేలా ఉన్నాయి. మోడీ ని కట్టడి చేయాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం. కేసీఆర్ మౌనంగా ఇంట్లో పడుకోలేదు. రహస్యంగా మోడీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పిచ్జి పట్టినట్టు మాట్లాడుతున్నారు. బీజేపీ.. కాంగ్రెస్ ఒక్కటి ఐతయా. ఎమ్మెల్సీలు ప్రమాణం చేస్తాం అంటే.. కుట్ర తో వాయిదా వేశారు. కోదండరాం గొప్పతనం ఒకరు చెప్పాలా. కోదండరాం ని ప్రశ్నించారు అంటే.. భావ దారిద్రంకి నిదర్శనం. సోనియాగాంధీ తెలంగాణ నుంసి బరిలో దించాలి అనేది ఆలోచన. ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కలుస్తాం. కేసీఆర్ ని మొన్నటు ఎన్నికల్లోనే బొక్కలు ఇరగా కొట్టి బోర్లా పడేశారు. కేసీఆర్ వచ్చి చేసేది ఏముంది. కేటీఆర్ ఏదేదో మాట్లాడతరు. పిల్లి శాపనర్దాలకు ఉట్టి తెగుతుందా. ఇరిగేషన్ శాఖపై జడ్జి నియామకం జరగ్గానే విచారణ.’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!