కూర్మగుడా కార్పొరేటర్ మహాపారా ఇంటి బకాయి ఉండటంతో వెళ్లిన విద్యుత్ ఉద్యోగి పై ఆరుగురు దాడి చేశారు. హైదరాబాద్ పాతబస్తీ మాదన్న పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ బకాయిలు వసూళ్లు చేస్తున్న విద్యుత్ ఉద్యోగి రజినేశ్ బాబు పై కూర్మగుడా కార్పొరేటర్ మహాపారా సోదరుడు శరఫత్, ఓ అడ్వకేటతో మరో నలుగురు దాడి చేశారు. బాధితునికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. టీఎస్ యుఈ ఈయు – సీఐటియూ యూనియన్ సభ్యులు పోలీసు స్టేషన్లకు చేరుకొని పిర్యాదు చేసారు.. ఈ సందర్భంగా ఆస్మాన్ ఘడ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. విద్యుత్ కార్మికుల పై ఇలాంటి దాడులు జరుగకుండా యాజమాన్యం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని. పాతబస్తీలో విద్యుత్ కార్మికులు విధులు నిర్వహించాలంటే భయబ్రాంతులకు గురైతున్నారు అంటూ వాపోయారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆస్మాన్ ఘాట్ డివిజన్ కార్యాలయం వద్ద నిరసన చేపడుతున్నట్లు తెలిపారు.