గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేంద్రం వరాలు జల్లులు కురిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే ఓట్ల పండుగ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తాయిలాలు ప్రకటించే ఛాన్సుందని సమాచారం. ముఖ్యంగా వాహనదారులకు శుభవార్త ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
Pakistan: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన ముగ్గురు మృతి
దేశ వ్యాప్తంగా నిత్యవసర ధరలు ఆకాశాన్నంటాయి. పేదలు, మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకుని ధరలు తగ్గొంచని భావిస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులకు బడ్జెట్‌లో తీపికబురు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. చాలా రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వందకుపైగా ఉన్న పెట్రోల్ ధరలను తగ్గిస్తే వాహనదారులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది. లీటర్‌పై రూ. 5 నుంచి రూ. 10 వరకు పెట్రోల్ ధర తగ్గించొచ్చని అనుకుంటున్నారు. అలాగే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం సహా వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు కూడా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Maldives: మాల్దీవులకు ఇండియన్స్ భారీ షాక్.. భారీగా పడిపోయిన ర్యాంక్
అలాగే పట్టణ ప్రజల కోసం ఇళ్లపై తక్కువ వడ్డీకే లోన్లు లేదా సబ్సిడీ అందించేందుకు పీఎం ఆవాస్ యోజన తరహాలో కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మధ్యంతర బడ్జెట్‌లో సామాన్యులకు లబ్ధి చేకూరేలా తాయిలాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరీ నిర్మలాసీతారామన్ ఏం చేస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.