పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారని అన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 9 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, నిర్ణయాలను చెప్పారన్నారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రతిపక్షాల నోట మాట లేదని, అన్ని రంగాల్లో మోడి ప్రభుత్వం అద్భుతమయిన అభివృద్ధి సాధించిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రపతి ప్రసంగంలో రాజకీయ అంశాలు లేకుండా, అభివృద్ధి పైనే మాట్లాడారని, వివిధ శాఖలు…
తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీతో చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సౌత్ కొరియా తీరం వద్ద కూలిన అమెరికా యుద్ధ విమానం.. దక్షిణ కొరియా తీరంలో అమెరికా యుద్ధ విమానం ఎఫ్-16 కూలింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆ విమాన పైలెట్ సేఫ్ గా బయట పడ్డారు. కేవలం నెలన్నర సమయంలో కొరియా తీరంలో ఎఫ్-16 యుద్ధ విమానం కూలడం ఇది సెకండ్ టైమ్. గత ఏడాది డిసెంబర్లో కూడా ఓ యుద్ధ విమానం కూడా ఇక్కడే కూలిపోయింది. 8వ ఫైటర్ వింగ్‌కు చెందిన ఎఫ్-16 ఫైటింగ్…
కేంద్ర బడ్జెట్ తయారీ అనేది చాలా నెలల పాటు సాగే సుదీర్ఘమైన కసరత్తు. బడ్జెట్ సమర్పణ అనేది దేశం యొక్క ఆర్థిక పథాన్ని రూపొందించే, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే కీలకమైన సంఘటన. భారతదేశంలో బడ్జెట్ ప్రక్రియ చరిత్ర చాలా ఆసక్తికరమైనది. మొదటి కేంద్ర బడ్జెట్‌ను నవంబర్ 26, 1947న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి సమర్పించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని, మూడు నెలల్లోగా ఈ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డులను వెంటనే ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలి. వెంటనే ట్రాఫిక్ నియంత్రణ విధులకు వారి సేవలను వాడుకోవాలని, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో (పీక్ అవర్స్‌లో) లా…
ఏపీలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో రిజిస్ట్రేషన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్లు రెండు రోజులుగా మొరాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కాసేపు రిజిస్ట్రేషన్లు జరిగితే కాసేపు నిలిచి పోతున్నాయి.
జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే చిత్తడి నేలలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. చిత్తడి నేలల పరిరక్షణకు సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేయాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొందని అన్నారు. తెలంగాణలోని చిత్తడి నేలల పరిరక్షణ, చిత్తడి నేలలను గుర్తింపు తదితర అంశాలకు సంబంధించి బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో స్టేట్ వెట్ ల్యాండ్స్ అథారిటీ…
నిబద్దత, క్రమ శిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న తమ సిబ్బందిపై కొందరు దాడులకు దిగడాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రతి రోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలుంటాయని, పోలీస్ శాఖ సహకారంతో నేరస్థులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా చర్యలు…