ఖమ్మం పార్లమెంటు సీటు పై పలువురి కన్ను పడింది. కాంగ్రెస్ లోని ముఖ్యులు ఈసీటుకోసం ప్రయత్నాలు ప్రారంబించారు. ఇందులో బాగంగా పది మంది లిస్టును జిల్లా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపించింది. మరో వైపున ఖమ్మం ఎంపి గా సీటు మల్లు నందినికి ఇవ్వాలని కోరుతు గాంధీ భవన్ లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వెళ్లి వినతి పత్రాన్ని అందించారు. అలా అందించిన వారు అంతా భట్టి వర్గీయులు .. అయితే జిల్లా కాంగ్రెస్ పార్టీ మాత్రం పది మంది లిస్టును పార్టీ అధిష్టానానికి ఇచ్చారు. ఇలా ఇచ్చిన వారిలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ లకు సీటు ఇవ్వాలని కోరారు. అదే విదంగా జిల్లా నుంచి పోటీ పడుతున్న వారి జాబితాను కూడ అధిష్టానం ఇచ్చింది. ఇలా ఇచ్చిన వారి లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కొడుకు తుమ్మల యుగందర్ ఉన్నారు.
వీరితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద రెడ్డి లతో పాటుగా మాజి మంత్రి రేణుక చౌదరి, మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నేత వి హెచ్ హనుమంత రావు, కాంగ్రెస్ సీనియర్ నేతకుసుమ కుమార్ లతో పాటుగా గతంలో ఎంఎల్ సి పదవికి పోటీచేసి ఓటమిపాలు అయిన రాయల నాగేశ్వరరావు, మాజీ ఎంఎల్ సి పోట్ల నాగేశ్వరరావు పేర్ల తో కూడిన ఒక్క నివేదిక ను కాంగ్రెస్ అధిష్టానానికి జిల్లా కాంగ్రస్ పార్టీ పంపించింది. వీరంతా ఆశావహులని డీసీసీ పేర్కొంది. రెండు రోజుల క్రితం జరిగిన పీఏసీ సమావేశంలో ఈ పేర్లను ఇచ్చినట్లుగా తెలుస్తోంది… ఇది ఇలా ఉంటే ఈ రోజు మాత్రం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని అదే విదంగా రాజ్యసభ మాజీ ఎంపి వి హెచ్ హనుమంత రావు లు కూడ గాంధీభవన్ లో దరఖాస్తుచేసుకున్నారు. మల్లు నందిని తరపున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస రెడ్డి వడ్డె నారాయణ రావు గాంధీ భవన్ లో ధరకాస్తు అందించారు.. వ్యాపార వేత్త వివిసి రాజేంద్ర ప్రసాద్ కూడ గాంధీ బవన్ లో తనకు ఖమ్మం ఎంపి సీటు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు.