కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, వర్రే కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. బ్రహ్మాండ నాయకుడు అన్న పదం ఉందని ఒక సినీ దర్శకుడు కాదన్నాడని.. పాట వద్దన్నందుకు తాను అతనికి పాట రాయడం మానేసానని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. తాము అనుమానించినట్లు గానే కాంగ్రెస్ పార్టీ అంటే నయవంచన, మోసంకు పర్యాయపదం అని రుజువు అయిందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలుపైగా ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగంగా.. కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో ఉదయం పావురాలను ఎగురవేస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఇష్యూలో ముగ్గురు వ్యక్తులపై పరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. గేమింగ్ యాక్ట్ బర్డ్స్ క్రుయాల్టీ యాక్ట్ లా కింద కేసు నమోదు చేశారు. 100 కిలోమీటర్లు ప్రైజ్ మనీ.. తర్వాత 200 కిలోమీటర్ల ప్రైస్ మనీ.. తర్వాత 300 కిలోమీటర్ల ప్రైస్ మనీ ఇలా బెట్టింగులకు పాల్పడుతున్నారు.
కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం.. కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్ళీ వస్తాయని అన్నారు. ఏడాది అయినా కేసీఆర్ జపం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పే ముఖ్యమంత్రి.. పరిపాలన చేతకాకే మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.
మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో వీడియో రికార్డుల కలకలం రేపుతోంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూం వద్ద ఓ యువకుడు వీడియో రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిగే చర్యలు తీసుకోవాలని హాస్టల్ ముందు స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 35 కోట్లతో పలు రోడ్లు, కమ్యూనిటీ హల్స్ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. మహిళ సాధికరితకు రూ. 80 కోట్ల నిధులు మంజూరు చేశారు.
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అక్షరాల మార్పు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అక్షరాల మార్పు కోసం 1000 కోట్ల రూపాయల ఖర్చు? రైతుల కోసం ‘రైతు భరోసా’ అమలు చేయలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, పింఛన్లు పెంచలేదు. ఇక ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేని కాంగ్రెస్ ప్రభుత్వం, అనవసరమైన విషయాల కోసం వేల…
ఉత్తర భారతదేశాన్ని కప్పేసిన మంచు.. ఆలస్యంగా నడుస్తున్న 200 విమానాలు ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలను మంచు చుట్టుముట్టడంతో పలు రాష్ట్రాల్లో వందలాది విమానాలు, అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్న చలిగాలులతో దృశ్యమానత తగ్గింది. ఈరోజు (జనవరి 4) ఉదయం రన్వేపై దృశ్యమానత సున్నాగా ఉండటంతో విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేసినందున ఢిల్లీ ఎయిర్ పోర్టులో 150కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా…
తెలంగాణ రాష్ట్రం గ్రీన్ పవర్ రంగంలో అద్భుత విజయాలను సాధించి, దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, ఉత్పత్తి, వ్యవసాయా రంగాల అభివృద్ధికి కేంద్రంగా ఉద్భవించిందని తెలిపారు.