ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్‌కు సంబంధించి ఆయా శాఖల ప్రతిపాదనలను ఈనెల 16 సాయంత్రం నాలుగు గంటల లోగా అందించాలని సీఎస్ విజయానంద్ తెలిపారు. కేబినెట్ సమావేశాల్లో భాగంగా.. గీత కార్మికులకు మద్యం షాపులు, రేట్ పెంపుపై కేబినెట్లో చర్చిస్తారు.
జనవరి 11 నుంచి 17 వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం, పాఠశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఉండగా, జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు హాలిడేలు ప్రకటించాయి. పాఠశాలలు తిరిగి జనవరి 18న (శనివారం) తెరుచుకోనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి ప్రారంభం కావాల్సి…
పల్నాడు జిల్లా సత్తెనపల్లి విషాదం నెలకొంది. అమరావతి మేజర్ కెనాల్లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. వృత్తిని రాఘవేంద్ర బాలకుటిర్‌కు చెందిన మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. అయితే.. కెనాల్లో దిగిన వీరు కొట్టుకుపోతుండటంతో స్థానికులు చూసి ముగ్గురిని కాపాడారు. మరో ఇద్దరు కెనాల్లో కొట్టుకుపోయారు.
ఐపీఎల్ 2025కి ముందు జరిగిన మెగా వేలంలో టీమిండియా మాజీ క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌ను అమ్ముడుపోలేదు. అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే తాజాగా.. మెగా వేలంలో అమ్ముడుపోలేదు. కానీ.. విజయ్ హజారే ట్రోపీలో మయాంక్ అగర్వాల్ చితక్కొడుతున్నాడు.
గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరోసారి పులి సంచారం కలకలం రేపుతుంది. పులి కదలికలపై స్థానికుల్లో భయాందోళనలు నెలకున్నాయి. ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్తున్న సమయంలో పులి రోడ్డు దాటడం చూసినట్టు ఆర్టీసీ కండక్టర్ రవి కిరణ్ చెబుతున్నాడు. ఆగిరిపల్లి మండలం కళ్ళుటూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ బొకినల రవి కిరణ్ ఉదయం డ్యూటీకి వెళ్తుండగా పులిని చూశాడు.
టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల రీ- రిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ చిత్రాలను 4k లో అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తూ సెలెబ్రేషన్స్ చేసే సంప్రదాయం పోకిరితో మొదలై అలా సాగుతూ ఉంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలను మరోసారి థియేటర్స్‌లో చూసి ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. తాజాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘నరసింహా’ రీ రిలీజ్ కానుందని…
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈనెల 8న మోడీ విశాఖకు రానున్నారు. పర్యటనలో భాగంగా.. ఎన్టీపీసీ ప్రాజెక్ట్, వైజాగ్ రైల్వే జోన్, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. అంతేకాకుండా.. కొన్ని పూర్తి అయిన ప్రాజెక్ట్‌లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
నేను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి, పల్లెల్లో పారిశుధ్యం, ప్రజల సంక్షేమంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మన దేశం గ్రామాలతో ముడిపడిందని, అందుకే గ్రామాలను ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత డిపిఓలదే అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు కృషి చేయాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల…
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తురక కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తురక కిషర్ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం తురక కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లారు.