ఇటీవల నందమూరి బాలకృష్ణ నిర్వహించిన అన్ స్టాపబుల్ షోలో కావాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా చేశారని ఒక ప్రచారం జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ స్టాపబుల్ నిర్వాహకులు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా డైరెక్టర్ బాబీ మిగతా అన్ని సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారని ఈ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఇదే విషయం మీద డాకు మహారాజ్ సినిమా నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు, అదేమీ లేదని చెప్పారు కూడా. అయితే ఇదే విషయాన్ని తాజాగా జరుగుతున్న డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో కూడా ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అయితే బయట జరుగుతున్న ప్రచారం ఏమీ నిజం కాదని దర్శకుడు బాబీ పేర్కొన్నారు.
Read Also: Ar Rahman : ఆ ఒక్క ట్యూన్ రెహ్మాన్ జీవితాన్ని మార్చేసింది తెలుసా!!
షోలో పాల్గొన్న సమయంలో స్క్రీన్ మీద ఏ ఫోటోలు వచ్చాయో వాటి గురించి మాట్లాడామని అంతకుమించి ఎడిట్ చేయాల్సింది, దాచాల్సింది ఏమీ లేదని అన్నారు. ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతున్న సమయంలో తనతో అలాగే నాగ వంశీతో పలానా సినిమాలో అయితే తారక్ బాగా చేసి ఉండేవాడని బాలయ్య అన్నారని పేర్కొన్నారు. అంతేకాదు.. తనకు జై లవకుశ బాగా నచ్చిన సినిమా అని బాలకృష్ణ రెండు మూడు సందర్భాలలో తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా బాబీ చెప్పారు. ఒక కుటుంబ వ్యవహారాన్ని ఇంతగా బయటకు లావాల్సిన అవసరం లేదని, ఏమీ జరగని దాని గురించి కూడా రకరకాల ప్రచారాలు చేస్తున్నారని ఈ సందర్భంగా దర్శకుడు బాబీ తెలిపారు.
Read Also: CM Chandrababu: కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వరాల జల్లు..