Kishan Reddy: సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి పర్యటన.. రైల్యేస్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ సికింద్రాబాద్ లో పర్యటించనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు రైల్యే స్టేషన్ అభివృద్ది పనులను పర్యవేక్షించునున్నారు. కాగా..కేంద్ర ప్రభుత్వం రూ.715 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్‌ను గతేడాది ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు దక్షిణ మధ్య రైల్వే జీఎం, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు దశల్లో స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టగా, మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీ అనిల్ కుమార్ జైన్ ఇతర సీనియర్ అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షిస్తారు. దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయ స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.715 కోట్లు కేటాయించారు. రైల్వేస్టేషన్ ఆధునీకరణతో పాటు స్టేషన్‌కు నలువైపులా రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.
Read also: Astrology: ఫిబ్రవరి 07, బుధవారం దినఫలాలు
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
కాంగ్రెస్ పార్టీ పాలన తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆరు హామీలు ప్రజల చేతుల్లో గారడీగా మారాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫించన్లు, ఇళ్లు, రేషన్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇంతవరకు వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వనరులను ఎలా కేటాయిస్తారనే దానిపై స్పష్టత లేదని ఆరోపించారు. రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. పొదుపు సంఘాల మహిళా సమావేశంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
Chile : చిలీలో చల్లారని కార్చిచ్చు.. 131మంది మృతి, 370మంది గల్లంతు, 3000ఇళ్లు దగ్ధం
తాజావార్తలు
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!