Adlur Laxman Kumar: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది.
నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు. టికెట్ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో ఆశించిన వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చనే విషయం చెప్పే ఛాన్స్ ఉంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలతో ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్‌లో గత రెండేళ్లుగా అగ్నిప్రమాదాలు పెరిగిపోవడంతో రానున్న వేసవిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అగ్నిమాపక శాఖతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) యొక్క ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టరేట్ కూడా నివాసితుల భద్రతను నిర్ధారించడానికి సన్నద్ధమవుతోంది. నగరంలో పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, కార్యాలయ…
గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి మండలంలో పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. పండ్ల తోటలు, ఆయిల్ పామ్ గిరిజన రైతులకు సాగు కోసం అధిక శాతం నిధులు, ఆర్థిక వెసులుబాటు ఇవ్వబడుతుంది. ఆ దిశగా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృషి చేయాలని అన్నారు. భట్టి విక్రమార్క ఆదివారం జిల్లాలోని భద్రాచలం ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వ్యవసాయశాఖ…
ఎల్లుండి (20 వ తేదీ)నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు భాగ్యలక్ష్మి ఆలయం లో యాత్ర వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మొత్తం 5 యాత్రలు చేపట్టనుంది తెలంగాణ బీజేపీ. అయితే.. ఎల్లుండి నాలుగు చోట్ల నుండి యాత్రలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుండి కాకతీయభద్రాద్రి క్లస్టర్ యాత్ర ప్రారంభం కానుంది. రెండు యాత్రలను ఇద్దరు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ప్రారంభించనున్నారు. ఇందులో.. కొమురం భీం క్లస్టర్…
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో షాదీఖానా చుట్టూ రాజకీయం తిరుగుతోంది. కోవెలకుంట్ల పట్టణంలో షాదీఖానా విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి జరుగుతోంది. షాదీఖానా పేరుతో మభ్యపెట్టి, కమ్యూనిటీ హాల్ నిర్మించి మోసం చేసినందుకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని బీసీ జనార్థన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ ఎన్నికల్లో యుద్ధం రెండు సిద్ధాంతల మధ్య జరగబోతోంది.. రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు రాయలసీమలో సముద్రం కన్పిస్తోందన్నారు. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత.. రాయలసీమకు జనసముద్రం వస్తే.. ఈరోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో యుద్ధం రెండు సిద్ధాంతల మధ్య జరగబోతోందని అన్నారు. ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా.. అని అన్నారు. ఈ యుద్ధం పేదలకు.. పెత్తందారులకు మధ్య జరగబోతుందని,. ఈ…