శనగలు, బెల్లం కలిపి తింటే రుచిగా ఉంటాయి. వీటితో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. శనగలు, బెల్లం తీనడం వల్ల దంతాలు, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా.. బెల్లం, శనగలు రెండూ హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి. బెల్లం శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. గ్రాము…
మేడారం సమ్మక్క-సారక్క జాతరకు ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ నిర్ణయించింది. ఆర్టీసీ రీజియన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 850 బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మేడారం ప్రత్యేక బస్సు సర్వీసుల శిబిరంలో రీజనల్ మేనేజర్ ఎస్ సుచరిత బస్సు సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం నుండి ఫిబ్రవరి 25 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు 24 గంటలూ నడపబడతాయి. CM Jagan: ఎన్నికలయ్యాక టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు..…
ప్రస్తుతం పొత్తులపై బీజేపీ అధిష్ఠానం ఏపీ నాయకత్వంతో మాట్లాడే అవకాశం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. అధిష్ఠానం మళ్లీ పిలిస్తేనే ఏపీ బీజేపీ నేతల బృందం చర్చల కోసం వస్తామని చెప్పారు. ఎప్పుడు చర్చల కోసం పిలుస్తారో తెలియదు.. చెప్పలేమన్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశాల్లో పురేంధేశ్వరీ పాల్గొన్నారు. దాదాపు ఏపీ నుంచి 270 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు.
రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి.. చంద్రబాబు నిజంగా నమ్మితే జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు? అని ప్రశ్నించారు. నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, ప్రజా బలం లేదనుకుంటే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా అని అన్నారు. తన…
ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలని సీఎం జగన్ అన్నారు. రాప్తాడు సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుంది.. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడా కనిపించవని ఆరోపించారు. ఈ ఎన్నికలు చాలా కీలకం.. అందుకే పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. తోడేళ్లుగా ఏకం అవుతున్నారన్నారు. వీరంతా సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితో,…
రాప్తాడు సిద్ధం సభలో చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత ఆశ చూపించి రైతన్నలను మోసం చేశాడని దుయ్యబట్టారు. గతంలో 87 వేల 612 వందల కోట్ల రుణమాఫీ చేస్తామన్నారు.. చేశారా అని ప్రశ్నించారు. మరోవైపు.. టీడీపీ, జనసేనపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలని, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలని డైలాగ్ కొట్టారు. మనం…
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీలో పాత ప్రభుత్వంపై బురద చల్లడం కోసమే జరిపారన్నారు. ప్రభుత్వం ఏమి చేయదల్చుకుందో నిర్దిష్టంగా చెప్పలేదని, మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలు 100 రోజుల్లో కాదు..72 రోజుల్లోనే అమలు చేయలేమని చేతులు ఎత్తేసిందన్నారు నిరంజన్ రెడ్డి. హరీష్ రావు మాట్లాడు తుంటే ఆరుగురు మంత్రులు కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. Rashmika Mandanna: చావు…
రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు రాయలసీమలో సముద్రం కన్పిస్తోందన్నారు. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత.. రాయలసీమకు జనసముద్రం వస్తే.. ఈరోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో యుద్ధం రెండు సిద్ధాంతల మధ్య జరగబోతోందని అన్నారు. ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా.. అని అన్నారు. ఈ యుద్ధం పేదలకు.. పెత్తందారులకు మధ్య జరగబోతుందని,. ఈ యుద్ధం విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోతుందని తెలిపారు.
బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలి.. ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని బరిలోకి దించాలని గోనెగండ్ల మాజీ సర్పంచ్ రంగముని పోతలపాటి అభ్యర్థించారు. ఆయనతో పాటు నాయకులు బాబు నాయుడు, లక్ష్మీనారాయణ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం వారికి కేటాయిస్తే.. తాము గెలిపించుకోవడానికి తమ శాయ శక్తుల కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు.. గోనెగండ్ల మండలంలోని కాశీ నీలకంఠేశ్వర దేవాలయం, చింతలముని నల్లారెడ్డి…
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ జట్టును 434 పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ (214), సర్ఫరాజ్ ఖాన్ (68) పరుగులతో అదరగొడితే.. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా స్పిన్ మాయజాలం చేశాడు. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 122 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్…