వ్యాయామ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్‌పీఈసెట్) - 2024 షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫుట్‌పాత్ పై ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాట్ సర్క్యూట్ కారణంగా ఒక షాపులో మంటలు ఎగసిపడగా.. ఆ తర్వాత పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. కాగా.. ఈ ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. మొదట మంటలు ఓ గ్యాస్ వెల్డింగ్ షాపు నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో…
హైదరాబాద్ లో పంటి చికిత్సకు వెళ్లి ఓ వ్యక్తి బలయ్యాడు. వింజం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ రోడ్ నెం.37లో ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌లో దంత చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. దంత వైద్యుడి నిర్లక్ష్యంగా కారణంగా మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అనస్థీషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడమే లక్ష్మీనారాయణ మరణానికి కారణమైందని అంటున్నారు.
రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి చిన్న భవనం కుప్పకూలిపోయింది. అంతేకాకుండా.. ఫ్యాక్టరీలోని రేకులు మొత్తం చెల్లాచెదురు అయ్యాయి. అయితే కొంతమంది కార్మికులు పనిచేస్తుండగా వారిపై వేడి ద్రవం పడినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు కార్మికులకు తీవ్రగాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి, జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకం అని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత బ్రాండ్ షూస్‌ను రిలీజ్ చేశారు. ఆదివారం నాడు ఫిలడెల్ఫియాలో కన్వెన్షన్ సెంటర్లో గోల్డెన్ షూలను ఆవిష్కరించాడు.
థాయ్ ఎయిర్వేస్ విమానంలో బ్రిటన్‌కు చెందిన ప్రయాణికుడు నానా రచ్చ చేశాడు. కోపంలో ఏకంగా విమాన సిబ్బందిలో ఒకరిపై చేయి చేసుకున్నాడు.. ఇక, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు కోనసీమవాసులు.
పాకిస్థాన్ లో సంకీర్ణ ప్రభుత్వానికి లైన్ క్లీయర్ అయింది. పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పవర్ షేరింగ్ ఫార్ములాకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.