Nuclear Weapons: అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపడాన్నికి తాము పూర్తి వ్యతిరేకమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. అంతరిక్ష ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగుతో నిర్వహించిన మీటింగ్ లో పుతిన్ మాట్లాడారు.. అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపడాన్ని రష్యా ఎప్పటికీ సమర్థించబోదన్నారు. కావాలనే కొన్ని దేశాలు తమపై ఆరోపలు చేస్తున్నాయన్నారు. అంతరిక్ష రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు తమతో కలిసి నడవాలని పాశ్చాత్య దేశాలను ఇప్పటికే పలుమార్లు ఆహ్వానించాం.. కానీ, కొన్ని కారణాల వల్ల కొన్ని దేశాలు ముందుకు రాలేదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత మాస్కోపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి.
Read Also: Health Tips : పరగడుపున వేడి నీటిలో అల్లం వేసి తాగుతున్నారా?
కాగా, అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంసక ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని ఇటీవల అమెరికా వెల్లడించింది. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని యూఎస్ తెలిపింది. ఆ ఆయుధాన్ని రష్యా ఇంకా మోహరించలేదు.. ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పు లేదని చెప్పుకొచ్చింది. అమెరికా ఆరోపణలను రష్యా అధ్యక్షుడు తోసిపుచ్చాడు.. ఉక్రెయిన్‌కు సాయంపై అమెరికా కాంగ్రెస్ మద్దతు పొందేందుకు జో బైడెన్ సర్కారు ఈ కొత్త ఎత్తు వేసినట్లు ఆయన ఆరోపించారు.