నిమ్మరసంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా.. నిమ్మకాయ తొక్కల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన ఆరోగ్యానికి నిమ్మరసం ఎంత ముఖ్యమో.. నిమ్మ తొక్కలు కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. అద్భుతమై ప్రయోజనాలు అందిస్తాయి. సాధారణంగా పండ్లు, కూరగాయలపై ఉన్న తొక్కలు తీసి పారేస్తాం. కొన్ని కూరగాయల తొక్కలతో పచ్చళ్లు చేసుకుని తింటారు. అయితే సాధారణంగా నిమ్మకాయను మాత్రం మనం రసం కోసం వాడుతుంటాం. కానీ నిమ్మతొక్క వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మకాయ తొక్కల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
నిమ్మ తొక్కలలో ఉండే బయోఫ్లావనాయిడ్స్ ఎముకల ఆరోగ్యానికి, ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. నిమ్మ తొక్కలు, విటమిన్ సి తో నిండి, సాధారణ వ్యాధులతో పోరాడటానికి మన రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. దీనిలో యాంటీ బాక్టీరియల్ భాగాలను కలిగి ఉంటాయి. ఇది ముఖ్యంగా నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా.. బయోఫ్లావనాయిడ్స్ ఎముకల ఆరోగ్యానికి, ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. నిమ్మ తొక్కలలోని ఫైబర్ కంటెంట్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది, గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఈ ప్రక్రియలో బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. నిమ్మ తొక్కలు గుండె ఆరోగ్యాన్ని నిర్వహించడానికి, అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్‌లతో నిండి ఉన్నాయి. అయితే.. నిమ్మ తొక్కలతో చట్నీలా తయారుచేసుకుని తింటే మంచిదని.. తినడానికి రుచికరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Virat Kohli: వారసుడొచ్చాడు.. కోహ్లీ ఇంట్లో సంబరాలు
చట్నీ తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు..
నిమ్మ తొక్క 1/2 కప్పు, జీలకర్ర 1/2 టీస్పూన్, పసుపు – 1/2 టీస్పూన్, చక్కెర 1 టీస్పూన్, ఉప్పు 1/2 టీస్పూన్ మరియు నూనె 1 టీస్పూన్ అవసరం.
ఎలా తయారు చేయాలంటే..
ఈ చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు నిమ్మ తొక్క తీసుకోండి. దానిని ఒక గ్లాసు నీటిలో వేసి కాసేపు మరిగించి.. నీళ్లలో నుంచి బయటకు తీయాలి. అలా చేయడంతో తొక్కలో ఉండే చేదు పోతుంది. ఆ తరువాత అన్ని రకాల మసాలా దినుసులను అందులో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అప్పుడు మీ చట్నీ రెడీ అవుతుంది.