CM Revanth Reddy: కాంగ్రెస్‌ను గెలిపించండి.. మరో రెండు గ్యారెంటీలు విడుదల చేసిన సీఎం
- ఢిల్లీ ఎన్నికల కోసం మరో రెండు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్
- ప్రతినెల 300 యూనిట్ల ఫ్రీ కరెంట్
- రూ. 500 కే ఉచిత సిలిండర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ఎన్నికల కోసం మరో రెండు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతీ నెల 300 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ. 500కే ఉచిత సిలిండర్ గ్యారంటీలను ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
Read Also: Formula E Race Case: కేటీఆర్‌ను విచారిస్తున్న ఈడీ.. వీటిపైనే ప్రశ్నలు!
Also Read
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర సమయంలో ఎన్నికల సమయంలో 5 గ్యారంటీలు హామీ ఇచ్చాం.. వాటిని విజయవంతంగా అమలుచేసి చూపించామని తెలిపారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా అలాంటి హామీలు ఇస్తున్నాం.. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని సీఎం రేవంత్ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. తెలంగాణలో ఒకేసారి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం.. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింది.. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ అన్నారు.. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. కానీ ఇచ్చింది మాత్రం కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమేనని ఆరోపించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, రూ.500 కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తెలంగాణాలో అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ హామీ ఇచ్చారు.. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి చాలా నష్టం జరిగినా సరే.. హామీ నిలబెట్టుకున్నారు తప్ప వెనుకడుగు వేయలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీలో అభివృద్ధి జరిగింది తప్ప.. ఆ తర్వాత పరిస్థితి ఎలాంటి దుస్థితికి చేరుకుందో చూడండని పేర్కొన్నారు. ఢిల్లీలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.. ఇటు సీఎంగా కేజ్రీవాల్, అటు పీఎంగా మోడీ ఢిల్లీకి చేసింది ఏమీ లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇద్దరూ కలిసి ఢిల్లీని నాశనం చేశారు.. ఇద్దరూ వేరు కాదు.. ఒక్కటే అన్నారు. ఢిల్లీని బాగుచేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే.. ఢిల్లీలో వాతావరణ కాలుష్యమే కాదు, రాజకీయ కాలుష్యాన్ని కూడా పెంచారన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మాదిరిగానే ఢిల్లీలో గెలిపిస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. లిక్కర్ స్కాం పార్టనర్‌ను తెలంగాణలో ఓడించాం.. అసలు పార్టనర్‌ను ఢిల్లీలో ఓడిస్తామని సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అడ్డుకుంటే చాలు, ఆ నిధులతో పేదలకు మంచి చేయవచ్చు.. తెలంగాణలో అదే చేశామన్నారు. కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!