పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) సంబంధించి దేశవ్యాప్తంగా అలజడి నెలకొంది. దేశవ్యాప్తంగా సీఏఏపై చర్చ మరోసారి తీవ్రమైంది. ఇంతకు ముందు కూడా పౌరసత్వ సవరణ చట్టంపై చాలాసార్లు వివాదాలు వచ్చాయి.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేపు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో.. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ‘కోహినూర్’ వజ్రం గురించిన కథ కూడా ఉంటుంది. తెలంగాణ భూముల్లోనే కోహినూర్ వజ్రం లభించిన సంగతి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ బుటకపు వాగ్దానాలు చేసి తెలంగాణా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం చేసి కేసీఆర్ ను బొంద తీసి పెట్టారని విమర్శించారు.…
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ నేటి నుంచి అమలులోకి రాబోతుందంటూ కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది.
ఆదిలాబాద్ బీజేపీలో నూతన చేరికల దుమారం చెలరేగింది. నిన్న బీజేపీలో గడ్డం నగేష్ చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బిఎల్ సంతోష్, లక్ష్మణ్ ని ఆదిలాబాద్ బీజేపీ నేతలు కలిశారు. బీజేపీలో నగేష్ చేరిక, లోక్ సభ స్థానాన్ని ఇవ్వడాన్ని ఆదిలాబాద్ బంజారా నేతలు రమేష్ రాథోడ్, రాథోడ్ బాపురావు(మాజీ ఎమ్మెల్యే) వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ.. పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న వారికి లోక్ సభ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని…
రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిగిలి ఉన్న ధాన్యాన్ని వెంటనే గిట్టుబాటు ధరకు సేకరించాలని ఆయన సర్కారును కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ రైతులతో కలిసి పెనమలూరు నియోజకవర్గంలో ఆయన నిరసన చేపట్టారు.
విరాట్ కోహ్లీ నేటితో ఆర్సీబీతో 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 2008 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరిన విరాట్ కోహ్లీ.. అప్పటి నుంచి వారితోనే కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు లీగ్ లోని ప్రతి సీజన్ లో ఒక ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ మొదటగా రూ.12 లక్షలకు ఆర్సీబీలో చేరాడు. ఐపీఎల్ 2008 డ్రాఫ్ట్ లో విరాట్ కోహ్లీ రూ.12 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు.
త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వివాదస్పదమైన 'పౌరసత్వ సవరణ చట్టం-2019'పై ఇవాళే రూల్స్ నోటిఫై చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల తర్వాత నేడు వాస్తవరూపం దాల్చనున్నట్లు సమాచారం.
ఈసారి సౌదీ అరేబియాలో మార్చి 10వ తేదీన ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనం ఇచ్చింది. దీంతో 11వ తేదీ సోమవారం నుంచి అక్కడ చంద్రుడు దర్శనమివ్వనున్నాడు. భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో మరుసటిరోజున చంద్రుడు దర్శనమిస్తాడు. అందుకే సౌదీ తర్వాతి రోజు నుంచి మన దేశంలో ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి.
రేపు కరీంనగర్లో బీఆర్ఎస్ 'కథనభేరి' సభ నిర్వహించబోతుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభ వివరాలను తెలిపారు. రేపు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య కార్యక్రమాలన్నీ కరీంనగర్ నుండే కేసీఆర్ ప్రారంభిస్తారు.. అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికల కథనభేరి కూడా కరీంనగర్ నుండే ప్రారంభం అవుతోందని గంగుల కమలాకర్ తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం పై…