ACB: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జమ్మికుంట తహసీల్దార్ రజనీని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే జమ్మికుంట తహసీల్దార్ ఆస్తులపై ఏసీబీ కీలక ప్రకటన చేసింది. మార్కెట్ విలువ ప్రకారం 20 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. 22 ఓపెన్ ప్లాట్స్‌తో పాటు ఏడు ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కిలోల కొద్ది బంగారు ఆభరణాలతో పాటు వెండి సామాగ్రిని స్వాధీనం చేసతున్నారు. పెద్ద మొత్తంలో బినామీ పేర్లతో ఆస్తులను కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. పెద్ద మొత్తంలో ఆస్తులు కొనడానికి తహసీల్దార్ రజిని అడ్వాన్సు చెల్లించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
Read Also: BRS: మరో నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్.. ఎవరంటే?
హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు హనుమకొండ కేఎల్ నగర్ కాలనీలోని ఆమె నివాసంతో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రెండంతస్తుల భవనం, రెండు చోట్ల ఇళ్ల స్థలాలు, 7 ఎకరాల వ్యవసాయ భూమి, రెండు కార్లు, 3 ద్విచక్రవాహనాలు, బ్యాంకులో రూ.25లక్షల నగదు నిల్వ, కిలోన్నర బంగారు ఆభరణాలు, రూ.లక్షన్నర నగదు గుర్తించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. గురువారం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో తహసీల్దార్ రజినీని హాజరు పరచనున్నట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.