Bhatti Vikramarka: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ వట్టిమాటలు చెబుతున్నదన్న నేతలకు మా పథకాలే సమాధానమని వ్యాఖ్యానించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బిల్లుల అమలుతో పేదల బతుకుల్లో వెలుగులు నిండాయన్నారు. కోదాడలో రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్లను అందించే బాధ్యత కాంగ్రెస్‌పై ఉందన్నారు.
Read Also: Aroori Ramesh: కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలోని అన్ని ఎత్తిపోతల నిర్మాణానికి ప్రణాళిక చేశామన్నారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చొరవతోనే కోదాడలో అభివృధ్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు లేని నిరంతర విద్యుత్‌ను అందిస్తుందన్నారు. పేదలకు రేషన్ కార్డులు అందిస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.