పెళ్లి ఊరేగింపుపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి! 11 మందికి గాయాలు మధ్యప్రదేశ్‌లోని రాయిసేన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి సుల్తాన్పూర్ ప్రాంతంలో పెళ్లి ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ ట్రక్కు అదుపు తప్పి.. జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 11 మందికి పైగా గాయపడగా.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి బృందం హోసంగాబాద్ నుంచి పిపరియా గ్రామానికి జాతీయ రహదారిపై…
వైసీపీ 13 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల కోసం వైసీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మేనిఫెస్టోతో ఓటర్లను ఆకర్షించిన జగన్ ఈ సారి అందులో ఏం పెట్టబోతున్నరాన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీ సూపర్ సిక్స్‌కు పోటీగా జగన్ మేనిఫెస్టో ఉండనుంది.…
కృష్ణా రిటైనింగ్ వాల్ ప్రాజెక్ట్ పచ్చని రివర్ ఫ్రంట్ పార్కు ఆవిర్భావంతో విజయవాడ నగరానికి కొత్త మైలురాయిగా మారింది. కృష్ణా నదికి 2.7 కి.మీ పొడవున్న ఆకట్టుకునే రిటైనింగ్ వాల్ నగరం యొక్క పచ్చని అభయారణ్యం. రిటైనింగ్ వాల్ లోతట్టు ప్రాంతాలకు కీలకమైన రక్షణను అందిస్తుంది, లక్ష మందికి పైగా నివాసితుల భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారిస్తుంది, రివర్ ఫ్రంట్ పార్క్ చాలా అవసరమైన శ్వాస స్థలం మరియు వినోద కేంద్రంగా పనిచేస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి…
నేడు 10 వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధాని మోడీ. విశాఖ- భువనేశ్వర్, విశాఖ- సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభం. కొత్తవలస- కోరాపుట్ సెక్షన్లు, కోరాపుట్-రాయగడ లైన్లలో డబ్లింగ్ పనులు ప్రారంభం. విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్‌లో పూర్తైన భాగాలు ప్రారంభం. నేడు సీఎం జగన్ విజయవాడ పర్యటన. కనకదుర్గ వారధి దగ్గర ఇరిగేషన్ రిటైనింగ్ వాల్.. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవం. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు…
తెలంగాణ కేబినెట్ మంగళవారం (మార్చి 11) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రేపటి క్యాబినెట్ లో పలు అంశాలపై చర్చించనున్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, 2500 రూపాయల ఆర్థిక సహాయం పై ప్రకటన.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. కొత్త రేషన్ కార్డుల జారీకి అనుమతి.. 2008 డీఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు.. 11 కొత్త బీసీ కార్పోరేషన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం పై చర్చించనున్నారు.
నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని, పెద్ద ఎత్తున పేదలకు జకాత్, ఫిత్రా పేరుతో దానధర్మాలు చేస్తారని గుర్తు చేశారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబంధనల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. CAA నిబంధనలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన 59 ఏళ్ల భర్త దారుణ హత్యను చూసిన అనంతరం 56 ఏళ్ల వయస్సు గల భార్య ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించింది.
ఉదయగిరి అభివృద్ధి ప్రధాత మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావును నెల్లూరులోని అతిధి గ్రౌండ్ హోటల్లో సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఘనంగా సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మీ రాజకీయ అనుభవాన్ని జోడించి తనను గెలిపించాలని కాకర్ల సురేష్ కోరారు. నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం బొల్లినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో నిర్వహించగా, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన మండల కన్వీనర్లు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే…