డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ఎంతగా జనాలకు మేలు చేస్తుందో అంతే కీడు చేస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రాచుర్యం పొందాక ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సాంకేతికత అభివృద్ధి చేసుకుంటూ, మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమలలో నేటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో స్వామి వారు విహరించనున్నారు.
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక ప్రకటన చేసింది. యంగ్ ప్లేయర్ రిషభ్ పంత్ ను కెప్టెన్ గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించి ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇటీవల గాయం నుంచి కోలుకున్న పంత్ కు NCA క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఐపీఎల్ సమయానికి జట్టులో చేరుతాడని అందరూ అనుకున్నప్పటికీ, కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పజెప్పింది యాజమాన్యం. అయితే.. ఈ సీజన్ లో పంత్ వికెట్…
ఆర్సీబీ (RCB) పేరు మారింది. Royal Challengers Bangalore గా ఉన్న ఫ్రాంచైజీ పేరును Royal Challengers Bengaluruగా మార్చారు. ఈ విషయాన్ని ఆర్సీబీ అధికారిక ఎక్స్ పేజీలో షేర్ చేశారు. ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ అన్ బాక్స్ 2024 కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 2014వ సంవత్సరంలో నగరం పేరును Bangalore నుంచి Bengaluruగా స్పెల్లింగ్ మార్చారు.
అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో జమ్మూలో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని జమ్మూ కాశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కోటి రూపాయలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతని కోసమని క్రైమ్ బ్రాంచ్ అనేక నగరాల్లో వెతుకులాట ప్రారంభించి చివరికి నిందితుడిని అరెస్ట్ చేశారు.
బీహార్లోని బగాహా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఆర్మీ సైనికులతో వెళ్తున్న ప్రత్యేక రైలు ప్రమాదానికి గురైంది. బగాహ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడంతో రైలు రెండు భాగాలుగా విడిపోయింది. రాజస్థాన్లోని ఆర్మీ బెటాలియన్ను బెంగాల్కు వెళ్తున్నట్లు సమాచారం. రైలులో సైనిక సిబ్బందితో పాటు వారి వాహనాలు కూడా ఉన్నాయి. ఈ రైలులోని మూడు బోగీలు బగాహా వద్ద రైల్వే ట్రాక్ నుండి పట్టాలు తప్పాయి. దీంతో.. గోరఖ్పూర్-నర్కటియాగంజ్ మధ్య రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది.
ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్.. ఆ కూటమికి ఓటేస్తే 4శాతం రిజర్వేషన్ పోయినట్లే టీడీపీ- బీజేపీ- జనసేన పార్టీలు చిలకలూరుపేటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇక, బీజేపీతో పొత్తు ఉన్న టీడీపీకి ఓటు వేస్తే ముస్లింల 4 శాతం పర్సెంట్ రిజర్వేషన్ పోయినట్లే అని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో గందరగోళం చేశారు.. ఒకరిపై ఒకరు దుష్ప్రచారాలు చేసుకొని నీచంగా మాట్లాడుకున్నారు అని ఆయన…
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉన్నందున ప్రస్తుత వేసవికాలంలో తాగునీటి అవసరాలకు ఏవిధమైన ఇబ్బందులు లేవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సి.ఎస్ మాట్లాడుతూ, యుద్ధప్రాతిపదికన మరమత్తులు చేపట్టి తాగునీటి సరఫరాను నిర్విరామంగా కొనసాగించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లోనూ సరిపడా నీటిని అందిస్తున్నామని, ఎవరైనా అదనపు వాటర్ ట్యాంకులు కోరితే వాటిని…